10, ఏప్రిల్ 2015, శుక్రవారం

రాంభూపాల్ చౌదరి (Rambhupal Chowdari)

రాంభూపాల్ చౌదరి
జననంఆగస్టు 1, 1942
స్వస్థలంఉయ్యాలవాడ
పదవులు3 సార్లు ఎమ్మెల్యే, రాష్ట్ర మంత్రి,
మరణంఏప్రిల్ 8, 2015
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా పనిచేసిన రాంభూపాల్ చౌదరి కర్నూలు జిల్లా ఓర్వకల్లు మండలం ఉయ్యాలవాడలో ఆగస్టు 1, 1942న జన్మించారు. బీఈ వరకు అభ్యసించి తర్వాత రాజకీయాలలో ప్రవేశించి కౌన్సిలర్‌గా ప్రస్థానం ఆరంభించారు. 3 సార్లు ఎమ్మెల్యేగా, రాష్ట్ర మంత్రిగా పనిచేశారు. ఏప్రిల్ 8, 2015న రాంభూపాల్ చౌదరి మరణించారు.

రాజకీయ ప్రస్థానం:
1981లో కౌన్సిలర్‌గా రాజకీయ ప్రస్థానం ఆరంభించిన రాంభూపాల్ చౌదరి 1982లో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావంతోనే ఆ పార్టీ ప్రవేశించారు. 1983లో కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి విజయం సాధించి తొలిసారి శాసనసభలో ప్రవేశించారు. 1984 రాజకీయ సంక్షీభం సమయంలో నాదెండ్ల భాస్కరరావు వర్గంలో చేరి ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో ప్రవేశించారు. 1985లో కాంగ్రెస్ తరఫున పోటీచేసి రెండో పర్యాయం ఎమ్మెల్యే అయ్యారు. 1989లో కూడా విజయం సాధించి 3 వరస విజయాలతో హాట్రిక్ సాధించారు. ఇదే సమయంలో నేదురుమల్లి జనార్థన్ రెడ్డి, కోట్ల విజయభాస్కర్ రెడ్డి మంత్రివర్గాలలో స్థానం పొందారు. 1994 నుంచి క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉండి 2014 ఎన్నికలకు ముందు మళ్ళీ తెలుగుదేశం పార్టీలో చేరారు.


విభాగాలు: కర్నూలు జిల్లా ప్రముఖులు, ఓర్వకల్లు మండలం, కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రులు,


 = = = = =


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక