తెలంగాణలో విద్యావ్యాప్తికి, గ్రంథాలయాల స్థాపనకు, విమోచనోద్యమానికి విశేష కృషి చేసిన రావిచెట్టు రంగారావు నల్లగొండ జిల్లా దండంపల్లి గ్రామంలో 1877లో జన్మించారు. రావిచెట్టు రంగారావు హైదరాబాదులో పేరుపొందిన సాహిత్యాభిమాని మరియు సంఘసేవకులు. తండ్రి మరణంతో వంశపారంపర్య మున్సబ్ పదవి లభించింది. సంఘసంస్కరణ కార్యక్రమాలలో పాల్గొంటూ ఈయన కొమర్రాజు లక్ష్మణరావుతో కలసి శ్రీ కృష్ణదేవరాయ ఆంధ్రభాషా నిలయం, పిమ్మట విజ్ఞాన చంద్రికా గ్రంథమండలిని స్థాపించారు. సంస్కృత భాషపై ఉన్న గౌరవంతో ఒక సంస్కృత గ్రంథాలయాన్ని స్థాపించారు. ఈ గ్రంథాలయం మొదట రంగారావు ఇంట్లోనే స్థాపించబడి, తొలి కార్యదర్శిగా ఐదు సంవత్సరాలు పనిచేసి ఆ భాషా నిలయానికి స్థిరమైన పునాది వేశారు. హైదరాబాద్ లో శ్రీకృష్ణదేవరాయల పేరిట గ్రంథాలయం స్థాపించినట్టే రావిచెట్టు రంగారావు గారు హన్మకొండలో 'రాజరాజనరేంద్ర' గ్రంథాలయాన్ని 1904 లో స్థాపించారు.
జాతీయోద్యమ సమయంలో రావిచెట్టువారు స్వదేశీ ఉద్యమాన్ని బలపరిచారు. స్వదేశంలో తయారైన వస్తువుల ప్రచారానికి ఆయన దృఢ సంకల్పంతో పనిచేశారు. 1908 సంవత్సరంలో భయంకరమైన మూసీనది వరదలు హైదరాబాదు నగరాన్ని ముంచివేసిన క్లిష్టకాలంలో రంగారావు హైదరాబాద్ నగర ప్రజలకు సహాయపడి, నిరాశ్రయులైన వారికి, వసతి సౌకర్యాలు కల్పించారు. వీరు ఎంతోమంది పేద విద్యార్ధులను తన ఇంట్లో వుంచుకొని ఉన్నత చదువులు చెప్పించారు. అలా వారి సహాయంతో పైకి వచ్చినవారిలో ఆదిరాజు వీరభద్రరావు ఒకరు. రంగారావు భార్య లక్ష్మీ నరసమ్మకూడా భర్తతో పాటు విద్యా వికాసానికి కృషిచేసింది.ఆంధ్రమహిళా సంఘానికి తొలి కార్యదర్శిగా లక్ష్మీనరసమ్మ పనిచేసింది. దేశానికి ఎంతో సేవ చేయవలసిన రంగారావు గారు తమ యుక్తవయస్సు లో 1911లోనే అకాల మరణం చెందారు. రావిచెట్టు రంగారావు జీవిత చరిత్రను ఆదిరాజు వీరభద్రరావు 'జీవిత చరితావళి' అనే గ్రంథంలో కథనం చేశారు. ఇది విజ్ఞాన చంద్రికా గ్రంథమండలి పక్షాన 1911 లో ప్రచురితమైంది.
= = = = =
సంప్రదించిన గ్రంథాలు, వెబ్‌సైట్లు:
|
3, ఏప్రిల్ 2015, శుక్రవారం
రావిచెట్టు రంగారావు (Ravichettu Ranga Rao)
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
Index
తెలుగులో విజ్ఞానసర్వస్వము
|
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు, సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, వార్తలు, సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు, |
విభాగాలు: |
------------
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి