ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నీ పరంపరలో 8వ దైన ఐపీఎల్ 2015 ఏప్రిల్ 8, 2015న ప్రారంభమైంది. 8 జట్ల మధ్యన నెలన్నర రోజులకు పైగా 60 మ్యాచ్‌ల ద్వారా కొనసాగిన ఈ టోర్నీలో గ్రూప్ దశలో చెన్నై సూపర్ కింగ్స్ అగ్రస్థానంలో ఉండగా, మే 24న జరిగిన ఫైనల్లో ముంబాయి ఇండియన్స్ 41 పరుగుల తేడాతో చెన్నై సూపర్ కింగ్స్ పై విజయం సాధించి రెండో సారి ఐపీఎల్ టోర్నీని గెలుచుకుంది.
గ్రూప్ దశ: గ్రూప్ దశకై 12 నగరాలలో 8 జట్ల మధ్యన జరిగిన పోటీలలో ఒక్కో జట్టు 14 మ్యాచ్‌లు ఆడగా చెన్నై సూపర్ కింగ్స్ 18 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచింది. ముంబాయి ఇండియన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, రాజస్థాన్ రాయల్స్ జట్లు చెరో 16 పాయింట్లతో మూందుకు వెళ్ళాయి. కోల్‌కత నైట్ రైడర్స్ 5వ స్థానంలోనూ, సన్‌రైజర్స్ హైదరాబాదు 6వ స్థానంలోనూ, ఢిల్లీ డేర్ డెవిల్స్ 7వ స్థానంలోనూ, కింగ్స్ ఎలెవన్ పంజాన్ చివరిస్థానంలో నిలిచి టోర్నీ నుంచి నిష్క్రమించాయి. ప్లేఆఫ్ దశ: గ్రూప్ దశలో తొలి రెండు స్థానాలలో నిల్చిన జట్ల మధ్యన (చెన్నై సూపర్ కింగ్స్, ముంబాయి ఇండియన్స్) మే 19న జరిగిన మొదయి క్వాలిఫయర్ మ్యాచ్‌లో ముంబాయి ఇండియన్స్ గెలిచి సరాసరిగా ఫైనల్స్ కు చేరింది. గ్రూప్ దశలో 3,4 స్థానాలలో నిల్చిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, రాజస్థాన్ రాయల్స్ మధ్యన జరిగిన మే 20 నాటి ఎలిమినేటర్ మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు విజయం సాధించింది. మొదటి క్వాలిఫైయర్‌లో ఓటమి చెందిన జట్టుకు, ఎలిమినేటర్ మ్యాచ్‌లో గెలిచిన జట్టుకు మధ్యన జరిగిన మే 22 నాటి రెండో క్వాలిఫైయర్ మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ విజయం సాధించి ఫైనల్స్ చేరింది. ఫైనల్ మ్యాచ్: మే 24న జరిగిన ఫైనల్ మ్యాచ్ ముంబాయి ఇండియన్స్ మరియు చెన్నై సూపర్ కింగ్స్ మధ్యన జరిగింది. చెన్నై సూపర్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎన్నుకుంది. మొదట బ్యాటింగ్ చేసిన ముంబాయి ఇండియన్స్ జట్టు 5 వికెట్ల నష్టానికి 202 పరుగులు చేయగా, తర్వాత బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్ జట్టు 8 వికెట్ల నష్టానికి 161 పరుగులు మాత్రమే చేయగలిగింది. దీనితో ముంబాయి ఇండియన్స్ 41 పరుగులతో ఐపీఎల్-8 విజేతగా నిల్చి రెండో సారి ఐపీఎల్ టోర్ని సాధించింది. ఐపీఎల్-2015 రికార్డులు:
= = = = =
|
25, మే 2015, సోమవారం
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2015 (Indian Premier League 2015)
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
Index
తెలుగులో విజ్ఞానసర్వస్వము
|
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు, సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, వార్తలు, సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు, |
విభాగాలు: |
------------
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి