25, మే 2015, సోమవారం

పర్సా సత్యనారాయణ (Parsa Satyanarayana)

జననంజూన్ 2, 1924
రంగంతెలంగాణ సాయుధపోరాటం,
పదవులుపాల్వంచ ఎమ్మెల్యే (1962-67)
మరణంమే 22, 2015
కమ్యూనిస్టు నాయకుడు, తెలంగాణ సాయుధ పోరాటయోధుడు అయిన పర్సా సత్యనారాయణ గుంటూరు జిల్లా కంభంపాడులో జూన్ 2, 1924న జన్మించారు. 1943 నుంచి ఖమ్మం జిల్లా కొత్తగూడెంలో ఆ తర్వాత తెనాలి ప్రాంతంలోని నందివెలుగులో స్థిరపడ్డారు. 1962లో పాల్వంచ నుంచి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభకు ఎన్నికైనారు. సుధీర్ఘకాలం సిఐటియు రాష్ట్ర అధ్యక్షుడిగా వ్యవహరించిన సత్యనారాయణ మే 22, 2015న మరణించారు.

సాయుధ పోరాటం, కార్మికోద్యమం:
చిన్నవయసులోనే పర్సా సత్యనారాయణ కమ్యూనిస్ట్ ఉద్యమంలో ప్రవేశించి నైజాం ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజలను సమీకరించి సాయుధ పోరుకు సిద్ధం కావడమే కాకుండా పాల్వంచ ఏరియా దళ కమాండర్‌గా పనిచేసి నిజాం అకృత్యాలపై పోరాటం కొనసాగించారు. నిజాంకు వ్యతిరేకంగా పోరాడి జైలుకు కూడా వెళ్ళారు. కార్మికుల జీవితాలలో వెలుగు నింపడానికి ఉద్యమాలను ఆయుధంగా చేసుకున్నారు. ఈ క్రమంలోనే సింగరేణి కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలపై దృష్టిసారించారు. ఇందుకుగాను పర్సా సింగరేణి కాలరీస్ ఎంప్లాయీస్ యూనియన్ ను స్దాపించారు. గని కార్మికుల జీవితాల్లో మార్పు కోసం అనేక పోరాటాలను ఈ యూనియన్ ద్వారా నిర్వహించారు.

రాజకీయ ప్రస్థానం:
పర్సా సత్యనారాయణ 1970 నుండి 2002 వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సిఐటియు రాష్ట్ర అధ్యక్షుడిగా సుధీర్ఘకాలం పనిచేశారు. 1962లో సీపీఎం తరఫున పాల్వంచ శాసనసభా నియోజక వర్గంనుంచి శాసనసభకు ఎన్నికైనారు. 1984లో ఖమ్మం లోకసభ నియోజకవర్గం నుంచి పోటీచేసి జలగం వెంగళరావు చేతిలో ఓడిపోయారు.

విభాగాలు: ఖమ్మం జిల్లా రాజకీయ నాయకులు, తెలంగాణ సాయుధ పోరాటయోధులు, 1924లో జన్మించినవారు, 2015లో మరణించినవారు,


 = = = = =


వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ముఖ్యమంత్రులు-గవర్నర్లు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, హాస్యం, చరిత్రలో ఈ రోజు,

   విభాగాలు: 
   ------------ 

   stat coun

   విషయసూచిక