6, మే 2015, బుధవారం

ఎడ్ల గురవారెడ్డి (Edla Guruva Reddy)

ఎడ్ల గురవారెడ్డి
జననంఆగస్టు 16, 1914
స్వస్థలంరామంచ (మెదక్ జిల్లా)
పదవులుఎమ్మెల్యే, ఎమ్మెల్సీ
మెదక్ జిల్లాకు చెందిన విమోచనోద్యమకారుడు, రాజకీయ నాయకుడైన ఎడ్ల గురువారెడ్డి ఆగస్టు 16, 1914న మెదక్ జిల్లా రామంచ గ్రామంలో జన్మించారు. సిద్ధిపేట మరియు హైదరాబాదులలో హైస్కూలు వరకు విద్యనభ్యసించి, సిటీ కాలేజీలో ఇంటర్మీడియట్, ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి బీఏ, ఏంఏ పట్టాపొందారు.

గురువారెడ్డి ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఉన్నప్పుడే వందేమాతరం ఉద్యమం జరిగింది. ఇతను కూడా ఉద్యమంలో చురుగ్గా పనిచేశారు. యూనివర్శిటీ నుంచి బహిషృతుడై నాగ్పూర్ లో చేరారు. నిషేధం తర్వాత మళ్ళీ హైదరాబాదు వచ్చి నిజాం నిరంకుశ పాలనకు, దాష్టీక రజాకార్లకు వ్యతిరేకంగా ఉద్యమించారు. వరంగల్ జిల్లాలో ప్రముఖమైన భైరాన్ పల్లి సంఘటనలో కూడా ఇతను పాల్గొన్నారు. మెదక్ జిల్లా విఠలాపూర్ లో గురువారెడ్డి ప్రోత్సాహంతో 5వేల మంది జెండావందనం చేశారు.

నిరంకుశ నిజాం ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరిగిన విమోచనోద్యమంలో చురుగ్గా పాల్గొని, హైదరాబాదు భారతయూనియన్ లో కలిసిన పిదప కమ్యూనిస్టు పార్టీలో కొనసాగారు. 1952లో సిద్ధిపేట అసెంబ్లీ నియోజకవర్గం నుంచి హైదరాబాదు రాష్ట్ర శాసనసభకు ఎన్నికైనారు.1958 లో విధానమండలికి ఎన్నికై 6 సం.లు ఎమ్మెల్సీగా ఉన్నారు.

విభాగాలు: మెదక్ జిల్లా సమరయోధులు, మెదక్ జిల్లా రాజకీయ నాయకులు, హైదరాబాదు రాష్ట్ర శాసససభ్యులు, సిద్ధిపేట అసెంబ్లీ నియోజకవర్గం


 = = = = =


వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ముఖ్యమంత్రులు-గవర్నర్లు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, హాస్యం, చరిత్రలో ఈ రోజు,

   విభాగాలు: 
   ------------ 

   stat coun

   విషయసూచిక