25, మే 2015, సోమవారం

జాన్ ఫోర్బెస్ నాష్ (John Forbes Nash)

జననంజూన్13, 1928
దేశంఅమెరికా
రంగంగణితవేత్త, ఆర్థికవేత్త,
అవార్డులు1994 నోబెల్ ఆర్థిక బహుమతి
మరణంమే 23, 2015
గేమ్ థియరీ ని ప్రతిపాదించి ఆర్థిక శాస్త్రాన్ని మలుపు త్రిప్పి మహోన్నత శిఖరాలకు చేర్చిన అమెరికాకు చెందిన గణిత శాస్త్రజ్ఝుడు జాన్ ఫోర్బెస్ నాష్ జూన్13, 1928న జన్మించాడు. జాన్ నాష్ 1958 లో స్కిజోఫ్రీనియా అనే మానసిక రుగ్మతకు గురై, 1990 లో నాష్ మళ్ళి పూర్వపు మేధాశక్తిని పొందినాడు. నాష్ ప్రతిపాదించిన సిద్ధాంతం నాష్ సమతాస్థితి గా ప్రసిద్ధి చెందింది. 1994 లో మరో ఇద్దరు గేమ్ థియరీ ప్రతిపాదకులతో కల్సి ఉమ్మడిగా ఆర్థిక శాస్త్రంలో నోబెల్ బహుమతి పొందినాడు. ప్రస్తుతం ప్రిన్స్‌టన్ విశ్వవిద్యాలయంలో ఒక మహా శాస్త్రవేత్త. తన జీవితం ఆధారంగా నిర్మించిన "A beautiful Mind" చిత్రం 2002 లో ఉత్తమ చిత్రంగా ఆస్కార్ అవార్డు పొందింది. మే 23, 2015న రోడ్డు ప్రమాదంలో జాన్ నాష్ ప్రాణాలు కోల్పోయాడు.

బాల్యం, విద్యాభ్యాసం:
జూన్ 13, 1928న అమెరికాలోని అపలేచియన్ పర్వతాలలోని బ్లూఫీల్డు, పశ్చిమ వర్జీనియా నగరంలో జన్మించిన జాన్ నాష్, కార్నెజీ మెలాన్ విశ్వవిద్యాలయం నుంచి ఉన్నత విద్య అభ్యసించినాడు. 22 ఏళ్ళ వయసులో ప్రిన్స్‌టన్ విశ్వవిద్యాలయం నుంచి పి.హెచ్.డి. పట్టా పొందినాడు. 12 సంవత్సరాల వయస్సులోనే తన గదిలో పరిశోధనలు ఆరంభించాడు. యుక్త వయస్సులో బయట ఎవరితోనూ కల్సి తిరిగేవాడు కాదు. ఏకాంతంగా తన పనిని తాను నిర్వర్తించేవాడు.

బాధాకరమైన జీవితం:
పరిశోధనలతో పురోగమిస్తున్న నాష్ జీవితంలో 29వ ఏటా స్కిజోఫ్రీనియా అనే మానసిక రుగ్మత సంక్రమించింది. అప్పటి నుంచి అతని మానసిక ప్రవృత్తి మారిపోయింది. ఏవేవో ఆలోచనలతో, సంభాషణలతో పిచ్చిపిచ్చిగా గడిపేవాడు. తర్వాత న్యూజెర్సీ లోని మానసిక చికిత్సాలయంలో బంధించారు. తీవ్రమైన చికిత్సా విధానాలకు గురైనాడు. వ్యాధి నయం కాకపోవడంతో ఆసుపత్రి నుంచి బయటకు వచ్చినాడు. హఠాత్తుగా 1990 లో నాష్ మళ్ళి పూర్వ వైభవాన్ని పొందినాడు.

నాష్ సమతాస్థితి:
ప్రతి గేమ్ కు ఫలితాలుంటాయని, గేమ్ లో పాల్గొన్న వారందరికీ ఆ ఫలితాలు ప్రయోజనకరంగా ఉంటాయని నాష్ భావన. అయితే ఈ సిద్ధాంతం న్యాయసమ్మతంగా ఉండకపోవచ్చు. కాని అర్థశాస్త్రపరంగా ప్రయోజనంకు ప్రాధాన్యత ఇచ్చాడు. ఉదాహరణకు ఒక నిర్ణీత సొమ్ము ఒక ధనవంతుడు, మరో బీదవాడు పంచుకోవాల్సి వస్తే చెరో సగం పంచుకోవడం న్యాయసమ్మతం. కాని నాష్ ధనవంతుడికే అధిక మొత్తం చెల్లించడం ప్రయోజనకరమని వాదించాడు. ధనవంతుడికి ఎంత డబ్బు ఉంటే అంత మంచిది. బీదవానికి ఎంత తక్కువ ఉంటే అంత మంచిది. అంతేకాకుండా బీదవాడు, ధనవంతుడి కంటే తక్కువ మొత్తం తీసుకోవడానికి ఒప్పుకుంటాడు. కాబట్టి నాష్ సమతాస్థితి ప్రకారం ప్రతి ఒక్కరికి సమాన ఫలితం లభించనప్పటికీ, సముచితమైన ప్రయోజనం లభిస్తుంది.

అవార్డులు, గుర్తింపులు:
అర్థశాస్త్రంలోనే ప్రముఖమైన గేమ్ థియరీని ప్రతిపాదించినందుకు జాన్ నాష్ కు 1994లో అత్యున్నతమైన అర్థశాస్త్ర నోబెల్ బహుమతి లభించింది. జాన్-సి-హర్సాన్యీ, రీన్‌హార్డ్ సెల్టెన్ లతో కల్సి ఉమ్మడిగా ఆ బహుమతిని పంచుకున్నాడు. తన జీవితంపై రచించిన "ఎ బీటిఫుల్ మైండ్" పుస్తకం ఆధారంగా అదే పేరుతో సినిమా తీయబడింది. ఆ సినిమాకు 4 ఆస్కార్ అవార్డులు లభించాయి.

విభాగాలు: అమెరికా ఆర్థికవేత్తలు, అమెరికా గణిత శాస్త్రవేత్తలు, నోబెల్ బహుమతి పొందిన ఆర్థికవేత్తలు, 1928లో జన్మించినవారు, 2015లో మరణించినవారు,


 = = = = =


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక