27, జూన్ 2015, శనివారం

గూడెం మహిపాల్ రెడ్డి (Gudem Mahipal Reddy)

గూడెం మహిపాల్ రెడ్డి
జననంసెప్టెంబరు 19, 1963
రంగంరాజకీయాలు
పదవులుఎంపీపీ, ఎమ్మెల్యే,
మెదక్ జిల్లాకు చెందిన రాజకీయనాయకుడైన గూడెం మహిపాల్ రెడ్డి సెప్టెంబరు 19, 1963న జన్మించారు. పటాన్‌చెరుకు చెందిన మహిపాల్ రెడ్డి ఇంటర్మీడియట్ వరకు విద్య అభ్యసించి 1996లో రాజకీయ ప్రవేశం చేశారు. 2013వరకు కాంగ్రెస్ పార్టీలో ఉంటూ పలు పార్టీ పదవుల్తో పాటు ఎంపీటీసి, ఎంపీపీ పదవులు చేపట్టారు. 2013లో వైకాపాలో, 2014లో తెరాసలో చేరి 2014 శాసనసభ ఎన్నికలలో తెరాస తరఫున పటాన్‌చెరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి విజయం సాధించారు.

రాజకీయ ప్రస్థానం:
1996లో రాజకీయ ప్రవేశం చేసిన గూడెం మహిపాల్ రెడ్డి తొలిసారిగా కాంగ్రెస్ పార్టీ తరఫున ఎంపీటీసి సభ్యుడిగా విజయం సాధించారు. 1996-99 కాలంలో పటాన్‌చెరు పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడిగా కూడా వ్యవహరించారు. 2001లో ఎంపీపీగా ఎన్నికై పిసిసి జిల్లా కార్యదర్శిగా కూడా పనిచేశారు. 2009 శాసనసభ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ టికెట్ లభించనందున కాంగ్రెస్ రెబెల్‌గా బీఎస్పీ తరఫున పోటీచేసి 30వేలకు పైగా ఓట్లు సాధించారు. 2013లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరి కొంతకాలానికి 2014లో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీలో చేరారు. 2014 శాసనసభ ఎన్నికలలో తెరాస తరఫున పటాన్‌చెరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీచేసి తొలిసారి ఎమ్మెల్యే అయ్యారు.

విభాగాలు: మెదక్ జిల్లా రాజకీయ నాయకులు, పటాన్‌చెరు అసెంబ్లీ నియోజకవర్గం, 14వ శాసనసభ సభ్యులు


 = = = = =


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక