13, జులై 2015, సోమవారం

సానియామీర్జా (Sania Mirza)

జననంనవంబరు 15, 1986
రంగంటెన్నిస్ క్రీడాకారిణి
టైటిళ్ళు4 గ్రాండ్‌స్లాం టైటిళ్ళు (డబుల్స్-1, మిక్స్‌డ్ డబుల్స్-3)
భారతదేశపు ప్రముఖ టెన్నిస్ క్రీడాకారిణి అయిన సానియామీర్జా నవంబరు 15, 1986న ముంబాయిలో జన్మించింది. ప్రపంచ డబుల్స్ ర్యాంకింగ్‌లో ప్రథమస్థానంలో ఉన్న సానియా 2015లో వింబుల్డన్ మహిళల డబుల్స్ టైటిల్ సాధించడమే కాకుండా 3 సార్లు మిక్స్‌డ్ డబుల్స్, దోహా మరియు ఇంచియాన్  ఏషియాడ్‌లలో మిక్స్‌డ్ డబుల్స్ స్వర్ణం, ఆఫ్రో-ఏషియన్ క్రీడలలో 4 స్వర్ణాలు సాధించింది. 2010లో పాకిస్తాన్‌కు చెందిన షోయబ్ అక్తర్‌ను వివాహం చేసుకున్న సానియా హైదరాబాదు నగరానికి చెందినది. ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం తరఫున బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తోంది.

క్రీడాప్రస్థానం:
2003లోనే వింబుల్డన్ బాలికల టఒటి సాధించిన సానియామీర్జా 2008లో ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో మహేష్ భూపతితో కలిసి మిక్స్‌డ్ డబుల్స్ ఫైన వరకు వెళ్ళగలిగింది. అదే ఏడాది అఫ్రో-ఏషియన్ క్రీడలలో మహిళల డబుల్స్, మిక్స్‌డ్ డబుల్స్, మహిళల సింగిల్స్, మహిళల టీం నాలిగింటిలోనూ స్వర్ణపతకాలు సాధించింది. 2006 దోహా ఏషియాడ్‌లో మిక్స్‌డ్ డబుల్స్‌లో స్వర్ణం గెలుచుకుంది. 2009లో ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో మహేష్ భూపతితో జతకట్టి తొలిసారి మిక్స్‌డ్ డబుల్స్ టైటిల్ సాధించింది. 2011లో రష్యాకు చెంసిన వెస్నినాతో కల్సి ఫ్రెంచ్ ఓపెన్ మహిళల డబుల్స్ ఫైనల్ వరకు వెళ్ళింది. 2012లో ఫ్రెంచ్ ఓపెన్‌లో మహేష్ భూపతితో కలిసి మిక్స్‌డ్ డబుల్స్ టైటిల్ సాధించింది. 2014లో ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో రొమేనియాకు చెందిన హోరియాతో కలిసి ఫైనల్ వరకు వెళ్ళింది. అదే ఏడాది అమెరికన్ ఓపెన్‌లో బ్రెజిల్‌కు చెందిన బ్రూనోతో జతకట్టి టైటిల్ సాధించింది. 2014లోనే ఇంచియాన్‌లో జరిగిన ఆసియాక్రీడలలో మిక్స్‌డ్ డబుల్స్ స్వర్ణం పొందగా 2015లో వింబుల్డన్‌లో స్విట్జర్లాండ్‌కు చెందిన మార్టినా హింగిస్‌తో కలిసి మహిళల డబుల్స్ టైటిల్ గెలుచుకుంది.

విభాగాలు: భారత ప్రముఖ క్రీడాకారులు, భారత టెన్నిస్ క్రీడాకారులు, తెలంగాణ క్రీడాకారులు, 1986లో జన్మించినవారు, ఆసియాక్రీడలలో స్వర్ణపతకం సాధించిన భారతీయులు, 


 = = = = =


Sania Mirza in Telugu, Sania Mirja essay, Indian Tennis Sports Persons Biography in Telugu, Telangana Sport Persons,

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ముఖ్యమంత్రులు-గవర్నర్లు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, హాస్యం, చరిత్రలో ఈ రోజు,

   విభాగాలు: 
   ------------ 

   stat coun

   విషయసూచిక