10, జులై 2015, శుక్రవారం

డి.శ్రీనివాస్ (D.Srinivas)

జననంసెప్టెంబరు 27, 1948
రంగంరాజకీయాలు
నిర్వహించిన పదవులుపిసిసి అధ్యక్షుడు, రాష్ట్ర మంత్రి,
తెలంగాణకు చెందిన ప్రముఖ రాజకీయ నాయకులలో ఒకరైన ధర్మపురి శ్రీనివాస్ సెప్టెంబరు 27, 1948న నిజామాబాదు జిల్లా వేల్పూరులో జన్మించారు. ఎల్.ఎల్.బి.అభ్యసించి ప్రారంభంలో న్యాయవాద వృత్తి చేపట్టారు. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాలలో ప్రవేశించి అంచెలంచెల్గా ఎదుగుతూ శాసనసభ్యుడిగా, రాష్ట్ర మంత్రిగా, పిసిసి అధ్యక్షుడిగా పలు పదవులు చేపట్టారు. జూలై 8, 2015న కాంగ్రెస్ పార్టీతో ఉన్న సుధీర్ఘ అనుబంధం వదిలిపెట్టి తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీలో చేరారు. ఈయన కుమారుడు ధర్మపురి సంజయ్ 2005-10 కాలంలో నిజామాబాదు నగరపాలక సంస్థ మేయరుగా పనిచేశారు.

రాజకీయ ప్రస్థానం:

1969లోనే శ్రీనివాస్ కాంగ్రెస్ పార్టీ అనుబంధ విద్యార్థి విభాగమైన NSUI కన్వీనరుగా వ్యవహరించారు. 1989లో తొలిసారిగా కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీచేసి నిజామాబాదు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎన్నికయ్యారు. అప్పుడే రాష్ట్ర మంత్రివర్గంలో కూడా చోటుపొంది పలు శాఖలు నిర్వహించారు. 1995లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పిసిసి అధ్యక్షుడిగా నియమితుడై 1999వరకు పనిచేశారు. 1999లో మళ్ళీ నిజామాబాదు నుంచి శాసనసభకు ఎన్నికయ్యారు. 2004లో మళ్ళీ పిసిసి అధ్యక్షుడిగా పదవి పొందినారు. 2004లో మూడో సారి శాసనసభకు ఎన్నికై వైఎస్సార్ మంత్రివర్గంలో స్థానం పొందారు. 2009లో నిజామాబాదు (పట్టణ) నియోజకవర్గం నుంచి పోటీచేసి భాజపా అభ్యర్థి యెండల లక్ష్మీనారాయణ చేతిలో పరాజయం పొందారు. తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో భాజపా ఎమ్మెల్యే రాజీనామా చేయగా జరిగిన ఎన్నికలలో మళ్ళీ పోటీచేసి మరోసారి యెండల చేతిలో ఓడిపోయారు. ఆ తర్వాత రాజ్యసభ సభ్యులుగా వ్యవహరించారు. 2015 జూలైలో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీలో చేరారు.

విభాగాలు : నిజామాబాదు జిల్లా రాజకీయ నాయకులు, పిసిసి అధ్యక్షులు, నిజామాబాదు అసెంబ్లీ నియోజకవర్గం, 1948లో జన్మించినవారు, వేల్పూరు మండలం,


 = = = = =


వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ముఖ్యమంత్రులు-గవర్నర్లు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, హాస్యం, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక