18, జులై 2015, శనివారం

త్రిపురనేని గోపీచంద్ (Tripuraneni Gopichand)

జననంసెప్టెంబరు 8, 1910
స్వస్థలంఅంగలూరు
రంగంసాహితీవేత్త
మరణంనవంబరు 2, 1962
తెలుగు సాహితీవేత్తగా పేరుపొందిన త్రిపురనేని గోపీచంద్ సెప్టెంబరు 8, 1910న కృష్ణా జిల్లా అంగలూరు గ్రామంలో జన్మించారు. ప్రముఖ సంఘసంస్కర్త త్రిపురనేని రామస్వామి కుమారుడైన ఈయన "అసమర్థుని జీవయాత్ర" రచనతో సాహితీవేత్తగా పేరు పొందడమే కాకుండా 1963లో "పండిత పరమేశ్వర శాస్త్రి వీలునామా" రచనకై సాహిత్య అకాడమీ అవార్డు కూడా పొందారు.

తండ్రి హేతువాది కావడంతో ప్రారంభంలో ఈయనపై తండ్రి ప్రభావం పడిననూ తర్వాత నాస్తికుడిగా మారారు. సినిమా రంగంలో కూడా ప్రవేశించి కొన్ని సినిమాలకు దర్శకత్వం మరికొన్ని సినిమాలకు మాటల రచయితగా వ్యవహరించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమాచారశాఖ సంచాలకులుగా కొంతకాలం పనిచేశారు. ఐదేళ్ళు ఆకాశవాణిలో కూడా పనిచేశారు. నవంబరు 2, 1962న గోపీచంద్ మరణించారు.

రచనలు:
అసమర్థుని జీవయాత్ర, గడియపడని తలుపులు, చీకటి గదులు, పండిత పరమేశ్వర శాస్త్రి వీలునామా, ప్రేమోపహతుల, పరివర్తన, యమపాశం, శిధిలాలయం, తత్వవేత్తలు, పోస్టు చేయని ఉత్తరాలు, మాకూ ఉన్నాయి సొగతాలు

విభాగాలు: తెలుగు సాహితీవేత్తలు, కృష్ణా జిల్లా రచయితలు, 1910లో జన్మించినవారు, 1962లో మరణించినవారు,


 = = = = =


వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ముఖ్యమంత్రులు-గవర్నర్లు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, హాస్యం, చరిత్రలో ఈ రోజు,

   విభాగాలు: 
   ------------ 

   stat coun

   విషయసూచిక