భారతదేశంలో రెండవ పొడవైన నది అయిన గోదావరి నది మహారాష్ట్రలోని నాసిక్ సమీపంలో త్రయంబకం వద్ద పశ్చిమ కనులలో జన్మించి మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల గుండా ప్రవహించి బంగాళాఖాతంలో సంగమిస్తుంది. 1465 కిలోమీటర్ల పొడవైన గోదావరి నది వెంబడి వందలాది పుణ్యక్షేత్రాలు, చారిత్రక పట్టణాలు ఉన్నాయి. ప్రాణహిత, మంజీరా, ఇంద్రావతి, శబరి, కిన్నెరసాని ఈ నది యొక్క ప్రధాన ఉపనదులు. దేశంలోని 12 పుష్కర నదులలో ఇది ఒకటి. 2015 జూలై 14న గోదావరి నదికి పుష్కరాలు ప్రారంభమయ్యాయి.
నది గమనం: అరేబియా సముద్రానికి 80 కిలోమీటర్ల దూరంలో నాసిక్ జిల్లా త్రయంబకం వద్ద చిన్న ధారగా జన్మించిన గోదావరి నది తూర్పువైపుగా, ఆ తర్వాత ఆగ్నేయ దిశగా ప్రవహిస్తుంది. నది జన్మస్థానానికి కొంత దూరంలోనే నాసిక్ క్షేత్రం ఉంది. ఇది దేశంలో కుంభమేళ జరుపుకొనే నాలుగు క్షేత్రాలలో ఒకటి. శాతవాహనుల రాజధానిగా పనిచేసిన ప్రతిష్టానపురం (పైథాన్), సిక్కు మతస్థుల పవిత్రక్షేత్రమైన నాందేడ్‌ల గుండా ప్రవహిస్తూ నిజామాబాదు జిల్లా కందకుర్తి వద్ద తెలంగాణ రాష్ట్రాన్ని స్పర్శిస్తుంది. ఆ తర్వాత తెలంగాణ, మహారాష్ట్రల సరిహద్దు గుండా ప్రవహిస్తూ బాసర సమీపంలో పూర్తిగా తెలంగాణలో ప్రవేశిస్తుంది. తెలంగాణలో నిర్మల్ జిల్లా, నిజామాబాదు జిల్లా, మంచిర్యాల జిల్లా, జగిత్యాల జిల్లా, పెద్దపల్లి జిల్లాల సరిహద్దుల నుంచి ప్రవహించి జయశంకర్ భూపాలపల్లి జిల్లా, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల గుండా ప్రవహించి ఆంధ్రప్రదేశ్‌లో ప్రవేశిస్తుంది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం వద్ద ప్రాణహితతో పాటు అంతర్వాహినిగా సరస్వతి నది కూడా సంగమించడంతో ఇది త్రివేణీసంగమంగా ప్రఖ్యాతిచెందింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గోదావరి సరిహద్దులో ప్రముఖమైన భద్రాద్రి పుణ్యక్షేత్రం ఉంది. ఆంధ్రప్రదేశ్‌లో ఉభయ గోదావరి జిల్లాల సరిహద్దు గుండా ప్రవహించి రాజమండ్రి వద్ద డెల్టా ఏర్పరుస్తుంది. అంతర్వేది వద్ద బంగాళాఖాతంలో కలుస్తుంది.
ఇవి కూడా చూడండి:
= = = = =
|
Tags: Godavari River in Telugu, About Godavari River in Telugu, Godavari River essay in Telugu, Godavari pushkaralu in telugu,
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి