నిజాంసాగర్ ప్రాజెక్టు కామారెడ్డి జిల్లాలో నిజాంసాగర్ మండలం అచ్చంపేట్ వద్ద మంజీర నదిపై నిర్మించబడింది. ఏడవ నిజాం ఉస్మాన్ అలీఖాన్ కాలంలో 1923లో నిర్మాణం ప్రారంభించబడి 1931లో పూర్తిచేశారు. ఈ ప్రాజెక్టు సృష్టికర్త నవాబ్ మీర్ అలీ నవాబ్ జంగ్. ఆయన ఈ ప్రాజెక్టుకు చీఫ్ ఇంజనీరుగా వ్యవహరించారు. ప్రాజెక్టు ఆయకట్టు 2.75 లక్షల ఎకరాలు. నీటిసామర్థ్యం 29.7 టీఎంసీలు. నిజాంసాగర్ నుంచి విడుదల చేసిన వరదనీరు శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి వెళ్ళుతుంది.
లబ్దిపొందే మండలాలు : పూర్వ కామారెడ్డి డివిజన్‌లోని మాచారెడ్డి, దోమకొండ, భిక్కనూర్, కామారెడ్డి, తాడ్వాయి, గాంధారి, లింగంపేట్, నాగిరెడ్డిపేట్ మండలాలు మినహా జిల్లాలోని అన్ని మండలాలు
= = = = =
సంప్రదించిన గ్రంథాలు, వెబ్‌సైటు:
|
Tags: Telangana Irrigation Projects in Telugu, Nizamaabd District Projects in Telugu, Manjeera River Projects in Telugu, Nizamsagar Project in Telugu,
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి