నిజాంసాగర్ కామారెడ్డి జిల్లాకు చెందిన మండలము. మండలంలో 17 ఎంపీటీసి స్థానాలు, 30 రెవెన్యూ గ్రామాలు కలవు. మండలంలో నిజాంసాగర్ ప్రాజెక్టు, సింగీతం ప్రాజెక్టు ఉన్నాయి. మండలం గుండా మంజీరానది ప్రవహిస్తోంది. అక్టోబరు 11, 2016న జిల్లాల పునర్వ్యవస్థీకరణ సమయంలో ఈ మండలం నిజామాబాదు జిల్లా నుంచి కొత్తగా అవతరించిన కామారెడ్డి జిల్లాలో చేరింది. కామారెడ్డి జిల్లా తొలి జడ్పీచైర్మెన్‌గా ఎన్నికైన శోభ ఈ మండలానికి చెందినవారు.
భౌగోళికం, సరిహద్దులు: నిజాంసాగర్ మండలం కామారెడ్డి జిల్లాలో దక్షిణంలో మెదక్ మరియు సంగారెడ్డి జిల్లాల సరిహద్దులో ఉంది. ఈ మండలానికి ఉత్తరాన బాన్సువాడ మండలం, ఈశాన్యాన గాంధారి మండలం, తూర్పున ఎల్లారెడ్డి మండలం, పశ్చిమాన పిట్లం మండలం, దక్షిణాన మెదక్ జిల్లా మరియు సంగారెడ్డి జిల్లాలు సరిహద్దులుగా ఉన్నాయి. జనాభా: 2011 లెక్కల ప్రకారం మండల జనాభా 36894. ఇందులో పురుషులు 17957, మహిళలు 18937. రాజకీయాలు: ఈ మండలము జుక్కల్ అసెంబ్లీ నియోజకవర్గం, జహీరాబాదు లోకసభ నియోజకవర్గంలో భాగముగా ఉన్నది. 2019 ప్రకారం మండలంలో 11 ఎంపీటీసి స్థానాలు కలవు. 2014లో నిజాంసాగర్ జడ్పీటీసిగా ఎన్నికైన దఫేదార్ రాజు నిజామాబాదు జడ్పీ చైర్మెన్ అయ్యారు. 2019లో నిజాంసాగర్ జడ్పీటిసిగా గెలుపొందిన ఆయన భార్య శోభ కామారెడ్డి జిల్లా తొలి జడ్పీచైర్మెన్ పదవి పొందారు. మండలంలోని రెవెన్యూ గ్రామాలు: Achampet, Arepalle, Banjepalle, Boorgul, Brahmanpalle, Galipur, Gorgal, Gunkul, Hasanpalle, Jakkapur, Komalancha, Konampalle, Magi, Mallur, Mangloor, Maqdumpur, Narsapoor, Narsingraopalle, Narva, Raghavapalle, Rangapur, Sanivarpet, Shairkhanpalle, Singitham, Telagapoor, Tunkepalle, Turkapalle, Velugunur, Vengalampalle, Waddepalle
ప్రముఖ గ్రామాలు / పట్టణాలు
అచ్చంపేట (Achampet):అచ్చంపేట కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ మండలమునకు చెందిన గ్రామము. ఈ గ్రామం వద్ద మంజీరానదిపై నిజాంసాగర్ ప్రాజెక్టు నిర్మించబడింది. ఇవి కూడా చూడండి:
= = = = =
సంప్రదించిన పుస్తకాలు, వెబ్‌సైట్లు:
|
About Nizamsagar Mandal Mandal Kamareddy Dist (district) Mandal in telugu, Kamareddy Dist Mandals in telugu,
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి