బిమల్ జలాన్ భారతదేశానికి చెందిన ఆర్థికవేత్త . ఇతను భారతీయ రిజర్వ్ బాంక్ కు రెండు పర్యాయాలు గవర్నర్ గా పనిచేసినారు. 2000 నవంబర్ 22 నుంచి 2002 నవంబర్ 21 వరకు ప్రథమ పర్యాయం, మళ్ళీ 2002 నవంబర్ 22 నుంచి 2004 సెప్టెంబర్ 6 వరకు పనిచేసి వై. వేణుగోపాలరెడ్డి కి పదవి అప్పగించారు. బిమల్ జలాన్ రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ గా ఉన్న సమయంలోనే రూ.1000 నోటు విడుదల కాబడింది. 2003లో జలాన్ రాజ్యసభ కు రాష్ట్రపతి చే నామినేట్ కాబడినారు. జీవితం: బిమల్ జలాన్, 1941 జూలై 3న రాజస్థాన్‌లోని సాదుల్‌పూర్‌లో జన్మించారు. ఈయన తండ్రి కృష్ణ నంద జలాన్, తల్లి జానకీ దేవి జలాన్. కొల్‌కతాలోని ప్రెసిడెన్సీ కళాశాలలో మరియు విదేశాలలో కేంబ్రిడ్జి, ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయాలలో విద్యనభ్యసించారు. వృతి రీత్యా ఆర్థికవేత్త అయిన జలాన్ భారత ప్రభుత్వపు పలు పరిపాలన మరియు సలహా పదవులు చేపట్టినారు. 1980 ప్రాంతంలో ప్రధాన ఆర్థిక సలహాదారుడిగా, 1985 నుంచి 1989 వరకు ఆర్థిక మంత్రిత్వ శాఖలో ఆర్థిక కార్యదర్శిగా పదవిని నిర్వహించారు. రిజర్వ్ బ్యాంక్ యొక్క కేంద్రీయ బోర్డు డైరెక్టర్టలో ఒకరిగా, 1991-1992 ప్రాంతంలో ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి చైర్మెన్ గా పదవులు పొందినారు. ప్రపంచ బ్యాంకు మరియు అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ బోర్డులకు భారత దేశం తరఫున ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా పనిచేశారు.
= = = = =
|
Tags: Indian Economists, Reserve Bank of India Governors, Famous Indians
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి