20, జూన్ 2016, సోమవారం

బీబీనగర్ మండలం (Bibinagar Mandal)


జిల్లాయాదాద్రి భువనగిరి జిల్లా
అసెంబ్లీ నియో.భువనగిరి అ/ని,
లోకసభ నియో.భువనగిరి లో/ని,
జనాభా45992 (2001)
48238 (2011)
బీబీనగర్ యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన మండలము. మండలంలో 25 రెవెన్యూ గ్రామాలు, 27 గ్రామపంచాయతీలు ఉన్నాయి. ఈ మండలము రంగారెడ్డి జిల్లా సరిహద్దుగా జిల్లాలో పశ్చిమం వైపున ఉంది. మండలం గుండా హైదరాబాదు-వరంగల్ ప్రధాన రహదారి, సికింద్రాబాదు - కాజీపేట్ రైల్వే లైన్ వెళ్ళుచున్నాయి. ఈ మండలము భువనగిరి అసెంబ్లీ నియోజకవర్గం, భువనగిరి లోకసభ నియోజకవర్గంలో భాగముగా ఉన్నది

సరిహద్దులు:
బీబీనగర్ మండలమునకు తూర్పున భువనగిరి మండలం, దక్షిణాన పోచంపల్లి మండలం, ఉత్తరాన బొమ్మల రామారాం మండలం, పశ్చిమాన రంగారెడ్డి జిల్లా సరిహద్దులుగా ఉన్నాయి.

జనాభా:
2001 లెక్కల ప్రకారం మండల జనాభా 45992, 2011 నాటికి జనాభా 2246 పెరిగి 48238 కు చేరింది. ఇందులో పురుషులు 24631, మహిళలు 23607. పట్టణ జనాభా 8323, గ్రామీణ జనాభా 39915.

రవాణా సౌకర్యాలు:
మండలం గుండా హైదరాబాదు-వరంగల్ ప్రధాన రహదారి, సికింద్రాబాదు - కాజీపేట్ రైల్వే లైన్ వెళ్ళుచున్నాయి. మండల కేంద్రం బీబీనగర్‌లో రైల్వేస్టేషన్ ఉంది. బీబీనగర్ నుంచి నడికుడికి రైలుమార్గం కూడా కలదు.

రాజకీయాలు:
ఈ మండలము భువనగిరి అసెంబ్లీ నియోజకవర్గం, భువనగిరి లోకసభ నియోజకవర్గంలో భాగముగా ఉన్నది.

మండలంలోని గ్రామాలు:
అనంతారం · అన్నంపట్ల · కొండమడుగు · గుర్రాలదండి · గూడూరు · చినరావలపల్లి · జమీలాపేట · జాంపల్లి · జియాపల్లి · జైన్‌పల్లి · నెమరుగోముల · పడమటిసోమారం · బాగ్‌దయారా · బీబీనగర్ · బ్రాహ్మణపల్లి · భట్టుగూడం  · మక్దూంపల్లి · మహదేవపూర్ · మాదారం · రంగాపూర్ · రహీంఖాన్‌గూడా · రాఘవాపూర్ · రాయారావుపేట · రావిపహాడ్ · రుద్రవెల్లి · వెంకిర్యాల


విభాగాలు: యాదాద్రి భువనగిరి జిల్లా మండలాలు, భువనగిరి అసెంబ్లీ నియోజకవర్గం,, 


 = = = = =


వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ముఖ్యమంత్రులు-గవర్నర్లు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, హాస్యం, చరిత్రలో ఈ రోజు,

   విభాగాలు: 
   ------------ 

   stat coun

   విషయసూచిక