నిర్మల్ జిల్లా తెలంగాణలోని 33 జిల్లాలలో ఒకటి. అక్టోబరు 11, 2016న అవతరించిన ఈ జిల్లాలో 2 రెవెన్యూ డివిజన్లు, 19 మండలాలు ఉన్నాయి. కొయ్యబొమ్మలకు మరియు పెయింటింగ్‌కు పేరుగాంచిన నిర్మల్ పట్టణం ఈ జిల్లా పరిపాలన కేంద్రంగా మారింది. నిర్మల్ జిల్లాలోని అన్ని మండలాలు ఇప్పటి ఆదిలాబాదు జిల్లాలోనివే. రాష్ట్రంలోనే ప్రసిద్ధి చెందిన జ్ఞాసరసరస్వతీ ఆలయం, కడెం ప్రాజెక్టు ఈ జిల్లాలో కలవు. కూచిపూడి నాట్యంలో ప్రపంచప్రసిద్ధి చెందిన రాధారాజారెడ్డిలు ఈ జిల్లాకు చెందినవారు. దేశంలోనే అతిపొడవైన 44వ నెంబరు జాతీయ రహదారి నిర్మల్ జిల్లా మీదుగా వెళ్ళుచున్నది. బాసరకు రైలుమార్గం ఉంది. నిర్మల్ మరియు భైంసాలలో ఆర్టీసి డిపోలు కలవు. జిల్లా దక్షిణ సరిహద్దు గుండా గోదావరి నది ప్రవహిస్తోంది.
జిల్లా సరిహద్దులు: ఈ జిల్లాకు ఉత్తరాన ఆదిలాబాదు జిల్లా, దక్షిణాన నిజామాబాదు మరియు జగిత్యాల జిల్లాలు, తూర్పున కొమురంభీం జిల్లాలు సరిహద్దులుగా ఉన్నాయి. ఈ జిల్లాకు దక్షిణాన గోదావరి నది ప్రవహిస్తుంది.
మండలాలు: నిర్మల్, నిర్మల్ గ్రామీణ, సోన్, నర్సాపూర్ జి, కదం పెద్దూర్, దస్తురాబాద్, ఖానాపూర్, మామడ, పెంబి, లక్ష్మణ్ చందా, సారంగాపూర్, కుభీర్, కుంటాలా, భైంసా, ముధోల్, బాసర, లోకేశ్వరం, తానూర్. జిల్లా ప్రత్యేకతలు: తెలంగాణ రాష్ట్రంలోనే ప్రసిద్ధిచెందిన జ్ఞానసరస్వతి ఆలయం, కొయ్యబొమ్మలకు మరియు పెయింటింగ్‌లకు పేరుగాంచిన నిర్మల్ పట్టణం, కాల్వ లక్ష్మీనరసింహస్వామి ఆలయం, కడెం ప్రాజెక్టు ఈ జిల్లా ప్రత్యేకతలు. ఇవి కూడా చూడండి:
= = = = =
|
Tags: bout Nirmal District in Telugu, 27 Dists of Telangana in Telugu, telugulo nirmal jilla, nirmal zilla in telugu
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి