అర్జెంటీనా దక్షిణ అమెరికాకు చెందిన దేశము. భౌగోళికంగా ప్రపంచంలో ఇది 8వ మరియు లాటిన్ అమెరికా దేశాలలో రెండో పెద్దదేశం. దక్షిణ అమెరికా ఖండంలో రెండో పెద్ద ఆర్థిక వ్యవస్థ కలిగిన దేశం. దేశ రాజధాని బ్యూనస్ ఎయిర్స్. 19వ శతాబ్ది ప్రారంభంలో ఈ దేశం స్పెయిన్ నుంచి స్వాతంత్ర్యం పొందింది. ఈ దేశం ఫుట్‌బాల్ క్రీడకు ప్రసిద్ధి. రెండుసార్లు ప్రపంచకప్ ఫుట్‌బాల్ టైటిల్‌ను, రెండుసార్లు ఒలింపిక్ ఫుట్‌బాల్ టైటిల్‌ను సాధించింది. ప్రఖ్యాత ఆటగాళ్ళు డీగో మారడోనా, లియోనెల్ మెస్సీలు ఈ దేశానికి చెందినవారు. భౌగోళికం, సరిహద్దులు: అర్జెంటీనా దక్షిణ అమెరికా ఖండంలో దక్షిణభాగంలో ఉంది. చిలీ, బొలీవియా, పరాగ్వే, బ్రెజిల్ దేశాలు సరిహద్దులుగా ఉన్నాయి. తూర్పున దక్షిణ ట్లాంటిక్ మహాసముద్రం ఉంది. దేశ వైశాల్యం 27,80,400 చకిమీ. దేశంలో 23 రాష్ట్రాలు (ప్రావిన్సులు) కలవు. దేశ జనాభా సుమారు 4.3 కోట్లు. పశ్చిమ ప్రపంచంలో ఎతి ఎత్తయిన అకాంకాగ్వా పర్వతశిఖరం ఈ దేశంలోనే ఉంది. ఇవి కూడా చూడండి:
= = = = =
|
Tags: Countries information in Telugu, Argentina in Telugu,
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి