27, ఆగస్టు 2017, ఆదివారం

జపాన్ (Japan)

ఖండంఆసియ
రాజధానిటోక్యో
కరెన్సీయెన్
జనాభా 12.7 కోట్లు
జపాన్ ఆసియా ఖండానికి చెందిన దేశము. తూర్పు ఆసియాలో భాగంగా ఉన్న ఈ దేశం పసిఫిక్ మహాసముద్రంలో ఉన్న ద్వీపాల సమూహం. ఆసియాలో తూర్పు వైపున ఉన్న ఈ దేశానికి సూర్యుడు ఉదయించు భూమిగా అభివర్ణిస్తారు. ఈ దేశ రాజధాని మరియు అతిపెద్ద నగరం టోక్యో. అధికార భాష జపానీస్, కరెన్సీ యెన్. దేశ జనాభా 12.7 కోట్లు, వైశాల్యం 3.78 లక్షల చకిమీ.

భౌగోళికం:
ఆసియా ఖండంలో తూర్పు వైపున ఉత్తరార్థగోళంలో పసిఫిక్ మహాసముద్రంలో ద్వీప సమూహంగా ఉన్న జపాన్ దేశం 377,972 చకిమీ వైశాల్యంలో ప్రపంచంలో 62వ స్థానంలో ఉంది. ఈ దేశం 6800కు పైగా ద్వీపా సమూహం. అందులో 4 ద్వీపాలు మాత్రమే పెద్దవి. అవి హోంషు, హొకైడో, క్యాషు, షికోకు. ఈ 4 ద్వీపాల వైశాల్యం జపాన్ దేశ వైశాల్యంలో 97% ఉంటుంది. టోక్యో, యోకోహామా, ఒసాకా జపాన్‌లోని పెద్ద నగరాలు.

చరిత్ర:
జపాన్ చాలా పురాతన చరిత్రను కలిగియుంది. క్రీ.పూ.30000 లలో జపాన్‌లో ఆది మానవులు నివశించినట్లు ఆధారాలు లభ్యమైనాయి. క్రీ.పూ 14000 నుంచి జొమోన్ వంశం మొదలుకొని 19వ శతాబ్దం లో ఎడో వంశం వరకు వివిధ రాజవంశాలు పాలించాయి. 20వ శతాబ్దం అనంతరం జపాన్ శక్తివంతంగా ఎదిగింది. 1905లో రష్యాను కూడా ఓడించింది. కాని రెండో ప్రపంచ యుద్ధంలో అమెరికా బాంబుదాడులకు గురై హీరోషిమా, నాగసాకి నగరాలు సర్వనాశనమయ్యాయి. ఆ తర్వాత యుద్ధాలకు దూరంగా ఉంటూ పారిశ్రామికంగా శక్తివంతమైంది.

ప్రభుత్వం, రాజకీయాలు:
జపాన్‌లో రాజరిక ప్రభుత్వం అమలులో ఉంది. రాజ్యాంగపరంగా అధినేత చక్రవర్తి అయిననూ వాస్తవ అధికారాలు ప్రధానమంత్రికి ఉన్నాయి. జపాన్ పార్లమెంటు పేరు డైట్. ఇది ద్విసభా పార్లమెంటు. ఎగువసభలో 242 స్థానాలు, దిగువసభలో 475 స్థానాలు ఉన్నాయి. దిగువసభకు ప్రతి నాలుగేళ్ళకోసారి ఎన్నికలు నిర్వహిస్తారు.

ఆర్థికం, పరిశ్రమలు:
ఆర్థికంగా (స్థూల జాతీయోత్పత్తి ప్రకారం) జపాన్ ప్రపంచంలో మూడో స్థానంలో ఉంది. ప్రపంచంలో పేరుపొందిన పలు పరిశ్రమలు జపాన్‌కు చెందినవి. టొయోటా, హోండా, సుజుకి, మిట్సుబిషి, మజ్దా లాంటి ఆటోమొబైల్ కంపెనీలు ఉత్పత్తి చేసే వాహనాలు ప్రపంచవ్యాప్తంగా పేరుగాంచాయి.

క్రీడలు:
సంప్రదాయకంగా సుమో జపాన్ జాతీయ క్రీడ. జూడో, కరాటె లాంటి క్రీడలు జపాన్ ప్రజలు ఇష్టపడతారు. ఆధునిక కాలంలో జపాన్ అన్ని క్రీడలలో మూందంజలో ఉండి ఒలింపిక్ క్రీడలు లాంటి అంతర్జాతీయ క్రీడలలో రాణిస్తుంది. 1964లో టోక్యో నగరం ఒలింపిక్ క్రీడలను కూడా నిర్వహించింది. 1972, 1998లలో శీతాకాల ఒలింఫిక్ క్రీడలు జపాన్‌లో జరిగాయి. రగ్బీ, వాలీబాల్, బ్యాడ్మింటన్ క్రీడలలో జపాన్ క్రీడాకారులు పలు స్వర్ణపతకాలు సాధించారు.


విభాగాలు: ప్రపంచ దేశాలు, ఆసియా దేశాలు, జపాన్,


 = = = = =


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

   విభాగాలు: 
   ------------ 

   stat coun

   విషయసూచిక