26, నవంబర్ 2020, గురువారం

డీగో మారడోనా (Diego Maradona)

జననం
అక్టోబరు 30, 1960
రంగం
ఫుట్‌బాల్ క్రీడాకారుడు
దేశం
అర్జెంటీనా
అవార్డులు
ఫుట్‌బాల్ ప్లేయర్ ఆఫ్ ది ట్వంటీత్ సెంచరీ
మరణం
నవంబరు 25, 2020
అర్జెంటీనాకు చెందిన ప్రముఖ ఫుట్‌బాల్ క్రీడాకారుడిగా పేరుపొందిన డీగో మారడొనా అక్టోబరు 30, 1960న అర్జెంటీనాలోని లానుస్‌లో జన్మించాడు. ఫుట్‌బాల్ చరిత్రలోనే అత్యంత ముఖ్యమైన క్రీడాకారులలో ఒకరిగా పరిగణించబడే మారడోనా మేనేజరుగా, కోచ్‌గా కూడా పనిచేశాడు. 1986 ఫీఫా ప్రపంచకప్‌లో అర్జెంటీనా జట్టుకు నాయకత్వం వహించి కప్ సాధించిపెట్టాడు. మొత్తం 4 సార్లు ఫీఫా టోర్నీలలో పాల్గొన్నాడు. 20వ శతాబ్దపు ఫీఫా ప్లేయర్‌గా అవార్డు పొందాడు. నవంబరు 25, 2020న టిగ్రేలో మరణించాడు.

క్రీడా ప్రస్థానం:
16 సం.ల వయస్సులోనే అర్జెంటీనా జూనియర్ జట్టుకు ఎంపికై తన ప్రతిభను నిరూపించుకున్నాడు. ఐదేళ్ళపాటు జూనియర్ జట్టులో కొనసాగి 115 గోల్స్ చేశాడు. ఆ తర్వాత బార్సిలోనా, నపోలీ జట్ల తరఫున ఆడినాడు. కొకైన్ డ్రగ్ కేసులో 15 నెలలు ఆటకు దూరమై ఆ తర్వాత సెవిల్లా తరఫున ఆడినాడు. సీనియర్ జట్టు తరఫున మొత్తం 91 మ్యాచ్‌లు ఆడి 34 గోల్స్ చేశాడు. 1982లో తొలిసారిగా ఫీఫా కప్‌లో ఆడి మొత్తం 4 సార్లు ఫీఫా టోర్నీలలో పాల్గొన్నాడు. 1986 టోర్నీలో అర్జెంటీ జట్టుకు నాయకత్వం వహించి కప్ సాధించిపెట్టడమే కాకుండా తాను స్వయంగా టోర్నీలో 5 గోల్స్ సాధించి ప్లేయర్ ఆఫ్ ది టోర్నీగా కూడా ఎంపికైనాడు. ఫుట్‌బాల్ చరిత్రలోనే ప్రసిద్ధి చెందిన "హ్యాండ్ ఆఫ్ గాడ్" గోల్ ఈ టోర్నీలో మారడానాకు సంబంధించినది. ఆట నుంచి రిటైర్మెంట్ తర్వాత మేనేజరుగా మరియు కోచ్‌గా కూడా బాధ్యతలు నిర్వహించారు. 
 
 
ఇవి కూడా చూడండి:
  • అర్జెంటీనా ఫుట్‌బాల్ జట్టు,
  • నవంబరు 25 (చరిత్రలో ఈ రోజు),
  • 2020 (తేదీవారీగా సఘటనలు),


హోం
విభాగాలు: అర్జెంటీనా, ప్రముఖ ఫుట్‌బాల్ క్రీడాకారులు,


 = = = = =


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక