5, సెప్టెంబర్ 2017, మంగళవారం

మరికల్ మండలం (Marikal Mandal)

జిల్లా నారాయణపేట
రెవెన్యూ డివిజన్ నారాయణపేట
అసెంబ్లీ నియోజకవర్గంమక్తల్
లోకసభ నియోజకవర్గంమహబూబ్‌నగర్
మరికల్ నారాయణపేట జిల్లాకు చెందిన మండలము. అక్టోబరు 11, 2016న తెలంగాణలో జిల్లాల పునర్వ్యవస్థీకరణ సమయంలో ఈ మండలం కొత్తగా ఏర్పడింది. వాగ్గేయకారుడు వాగ్గేయకారుడు కడుదాసు వెంకటదాసు మండల కేంద్రం మరికల్ గ్రామానికి చెందినవారు. మహబూబ్‌నగర్ జిల్లాలో ఉన్న ఈ మండలం ఫిబ్రవరి 17, 2019న ఈ మండలం కొత్తగా ఏర్పాటుచేసిన నారాయణపేట జిల్లాలో కలిసింది.

సరిహద్దులు:
ఈ మండలానికి తూర్పున దేవరకద్ర మండలం, దక్షిణాన చిన్నచింతకుంట మరియు నర్వ మండలాలు, పశ్చిమాన మక్తల్ మండలం, ఉత్తరాన మరియు వాయువ్యాన ధన్వాడ మండలం సరిహద్దులుగా ఉన్నాయి.

రాజకీయాలు:
ఈ మండలం నారాయణపేట అసెంబ్లీ నియోజకవర్గం, మహబూబ్‌నగర్ లోకసభ నియోజకవర్గంలో భాగంగా ఉంది.

మండలంలోని గ్రామాలు:
మరికల్ (Marikal), పస్పుల (Paspula), ఇబ్రహీంపట్నం (Ibrahimpatnam), పెద్దచింతకుంట (Peddachinthakunta), వెంకటాపూర్ (Venkatapur), తీలేర్ (Teelair), రాకొండ (Rakonda), ఎలిగండ్ల (Yeligandla), మాధ్వార్ (Madwar), పూసల్‌పాడ్ (Pusalpad), చిత్తనూరు (Chittanur), ఎక్లాస్‌పూర్ (Eklaspur), జిన్నారం (Jinnaram), కన్మనూర్ (Kanmanoor)

కాలరేఖ:
 • 2016, అక్టోబరు 11: ధన్వాడ మండలంలోని 14 గ్రామాలను విడదీసి కొత్తగా మరికల్ మండలం ఏర్పాటుచేయబడింది.
 • 2019, ఫిబ్రవరి 17: మహబూబ్‌నగర్ జిల్లాలో ఉన్న ఈ మండలం ఫిబ్రవరి 17, 2019న కొత్తగ అవతరించిన నారాయణపేట జిల్లాలో చేరింది. 
 • 2019, ఏప్రిల్ 10: తీలేరులో ఉపాధి కూలీపని చేస్తున్న వారిపై మట్టిపెళ్ళలు విరగపడి 10 మంది మరణించారు.
(మరికల్ మండలంలోని గ్రామపంచాయతీలు)

ఇవి కూడా చూడండి:
విభాగాలు: నారాయణపేట జిల్లా మండలాలు,  మరికల్ మండలము,   మక్తల్ రెవెన్యూ డివిజన్,  మహబూబ్‌నగర్ లోకసభ నియోజకవర్గం,

= = = = =
సంప్రదించిన పుస్తకాలు, వెబ్‌సైట్లు:
 • Handbook of Statistics, Mahabubnagar Dist, 2008,
 • Handbook of Census Statistics, Mahabubnagar Dist, 2001,
 • Census of India 2011, Provistional Population Totals, Part 2, Volume 2 of 2011. 
 • బ్లాగు రచయిత పర్యటించి, తెలుసుకున్న విషయాలు, 
 • పాలమూరు విజ్ఞానసర్వస్వము (బీఎస్ శాస్త్రి),
 • తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వు G.O.Ms.No.241 Dt: 11-10-2016 
 • https://narayanpet.telangana.gov.in/ (Narayanapet Dist official website)

Tags: Gandeed Mandal in Telugu, Mahabubnagar Dist information in Telugu,

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ముఖ్యమంత్రులు-గవర్నర్లు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, హాస్యం, చరిత్రలో ఈ రోజు,

   విభాగాలు: 
   ------------ 

   stat coun

   విషయసూచిక