మూసాపేట్ మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన మండలము.అక్టోబరు 11, 2016న ఈ మండలం కొత్తగా ఏర్పడింది. అదివరకు అడ్డాకల్ మరియు ఘన్‌పూర్ మండలాలలో ఉన్న 13 గ్రామాలను విడదీసి ఈ మండలాన్ని ఏర్పాటుచేశారు. 44వ నెంబరు జాతీయ రహదారి ఈ మండలం గుండా వెళ్ళుచున్నది. ఈ మండలం మహబూబ్‌నగర్ రెవెన్యూ డివిజన్, దేవరకద్ర అసెంబ్లీ నియోజకవర్గం, మహబూబ్‌నగర్ లోకసభ నియోజకవర్గంలో భాగంగా ఉంది.
సరిహద్దులు: ఈ మండలానికి ఉత్తరాన మహబూబ్‌నగర్ గ్రామీణ మండలం, ఈశాన్యాన భూత్పూర్ మండలం, దక్షిణాన అడ్డాకల్ మండలం, పశ్చిమాన దేవరకద్ర మండలం, తూర్పున వనపర్తి జిల్లా సరిహద్దులుగా ఉన్నాయి. మండలంలోని గ్రామాలు: సంకల్‌మద్ది (Sankalamaddi), తునికిపూర్ (Thunkinipur), వేముల (Vemula), నిజలాపూర్ (Nizalapur), జానంపేట (Janampeta), కొమిరెడ్డిపల్లి (Komireddipalle), దాసరిపలి (Dasaripalle), చక్రాపూర్ (Chakrapur), కంకాపూర్ (Kankapur), పోల్కంపల్లి (Polkampalle), తిమ్మాపూర్ (Thimmapur), నందిపేట్ (Nandipet), మహ్మద్ హుస్సేన్‌పల్లి (Mohammed Hussainpalle)
= = = = =
సంప్రదించిన పుస్తకాలు, వెబ్‌సైట్లు:
|
Tags: Gandeed Mandal in Telugu, Mahabubnagar Dist information in Telugu,
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి