గండిపేట రంగారెడ్డి జిల్లాకు చెందిన మండలం. ఇది రాజేంద్రనగర్ రెవెన్యూ డివిజన్, రాజేంద్రనగర్ అసెంబ్లీ నియోజకవర్గం, చేవెళ్ళ లోకసభ నియోజకవర్గంలో భాగంగా ఉంది. అక్టోబరు 11, 2016న ఈ మండలం కొత్తగా అవతరించింది. అంతకు క్రితం రాజేంద్రనగర్ మండలంలో ఉన్న గ్రామాలను విడదీసి ఈ మండలాన్ని ఏర్పాటుచేశారు. మూసీనది మండలం గుండా ప్రవహిస్తుంది. ఉస్మాన్‌సాగర్‌గా పిల్వబడే గండిపేట చెరువు ఈ మండలంలో ఉంది. తెలంగాణ శాసనమండలి తొలి చైర్మెన్‌గా పనిచేసిన కె.స్వామిగౌడ్ ఈ మండలమునకు చెందినవారు. సరిహద్దులు: ఈ మండలానికి ఉత్తరాన శేరిలింగంపల్లి మండలం, దక్షిణాన రాజేంద్రనగర్ మండలం, పశ్చిమాన శంకర్‌పల్లి మండలం, తూర్పున హైదరాబాదు జిల్లా సరిహద్దులుగా ఉన్నాయి. రాజకీయాలు: ఈ మండలం రాజేంద్రనగర్ అసెంబ్లీ నియోజకవర్గం, చేవెళ్ళ లోకసభ నియోజకవర్గంలో భాగంగా ఉంది. తెలంగాణ శాసనమండలి తొలి చైర్మెన్‌గా పనిచేసిన కె.స్వామిగౌడ్ ఈ మండలమునకు చెందినవారు. మండలంలోని గ్రామాలు: Alijapur, Bandlaguda Jagir, Dargah Khaliz Khan, Bairagiguda, Gandamguda, Gandipet, Gungurthy, Himayathsagar, Hydershakote, Jani Begum, Khanapur, Kismathpur, Kokapet, Makthakousarali, Manchirevula, Narsingi, Neknampur, Panjamshajamal Bowli, Peeramcheruu, Pokalwada, Sikenderguda, Vattinagulapally, Manikonda Jagir, Manikonda Kalsa, Puppalguda మండలంలోని ముఖ్యమైన గ్రామాలు/పట్టణాలు: కిస్మత్‌పుర్ (Kismathpur) :
కిస్మత్‌పూర్ రంగారెడ్డి జిల్లా గండిపేట మండలమునకు చెందిన గ్రామము. ప్రత్యేక తెలంగాణ ఉద్యమ నాయకుడు, రాజకీయ నాయకుడు కె.స్వామిగౌడ్ ఈ మండలమునకు చెందినవారు.
= = = = =
సంప్రదించిన పుస్తకాలు, వెబ్‌సైట్లు:
|
Tags: Gandipet Mandal in telugu, rangareddy Dist Mandals information in telugu, Gandipet cheruvu
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి