5, ఫిబ్రవరి 2018, సోమవారం

ముద్దసాని కోదండరాం (Muddasani Kodandaram)

ముద్దసాని కోదండరాం
జననం1955
జన్మస్థానంమంచిర్యాల
ప్రత్యేకతT-JAC చైర్మెన్
పార్టీతెలంగాణ జనసమితి
తెలంగాణ ఉద్యమ నాయకుడిగా, టి-జెసీఏ చైర్మెన్‌గా, రాజనీతివేత్తగా ప్రసిద్ధి చెందిన కోదండరాం అసలు పేరు ముద్దసాని కోదండ రామిరెడ్డి. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో రాజనీతి శాస్త్రం ఆచార్యుడిగా పనిచేశారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమం సమయంలొ జాయింట్ యాక్షన్ కమిటీ (JCA) చైర్మెన్‌గా విజయవంతమైన పాత్రపోషించారు.

కోదండరాం 1955లో మంచిర్యాలలో జన్మించారు . విద్యభ్యాసం వరంగల్ నగరంలో జరిగింది. వరంగల్లులోని ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో బి.ఏ. పూర్తిచేసి రాజనీతి శాస్త్రంలో ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి ఎం.ఏ. చేశారు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలోనే (సికింద్రాబాదు పిజి కళాశాల) ఆచార్యులుగా పనిచేశారు. 2003లో డాక్టరేట్ పట్టా పొందారు. 2014లో వరల్డ్ పీస్ ఫెస్టివల్ అవార్డు పొందారు.

తెలంగాణ రాష్ట్ర అవతరణ తర్వాత ఉద్యోగుల మరియు విద్యార్థుల పక్షం వహించి పోరాటం సాగించారు. ఉద్యోగ నియామకాలకై పెద్ద బహిరంగ సభ నిర్వహించి ప్రభుత్వానికి సవాలు విసిరారు. మార్చి 29, 2018న కోదండరాం "తెలంగాణ జనసమితి" పేరుతో రాజకీయ పార్టీ ప్రారంభించారు.

విభాగాలు: తెలంగాణ ప్రముఖులు, మంచిర్యాల, 


 = = = = =


వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

   విభాగాలు: 
   ------------ 

   stat coun

   విషయసూచిక