శేరిలింగంపల్లి రంగారెడ్డి జిల్లాకు చెందిన మండలం. ఈ మండలం రాజేంద్రనగర్ రెవెన్యూ డివిజన్, శేరిలింగంపల్లి అసెంబ్లీ నియోజకవర్గం, చేవెళ్ళ లోకసభ నియోజకవర్గంలో భాగంగా ఉంది. ఇది హైదరాబాదు నగరంలో భాగంగా ఉంది. సైబరాబాదుగా పేరుపొందిన హైటెక్‌సిటి, మాదాపూర్ లాంటి సాఫ్ట్‌వేర్ కంపెనీలు, హైదరాబాదు కేంద్రీయ విశ్వవిద్యాలయం నెలకొనియున్న ప్రాంతాలు ఈ మండల పరిధిలోకి వస్తాయి.
సరిహద్దులు: ఈ మండలానికి దక్షిణాన గండిపేట మండలం, తూర్పున హైదరాబాదు జిల్లా, ఉత్తరాన మేడ్చల్ జిల్లా, పశ్చిమాన సంగారెడ్డి జిల్లా సరిహద్దులుగా ఉన్నాయి. జనాభా: 2001 లెక్కల ప్రకారం మండల జనాభా 153364. 2011 లెక్కల ప్రకారం మండల జనాభా 305474. ఇందులో పురుషులు 158766, మహిళలు 146708. అక్షరాస్యుల సంఖ్య 227696. మండలం మొత్తం పట్టణ ప్రాంతమే. స్త్రీపురుష నిష్పత్తిలో (924/వెయ్యి పురుషులకు). మండలంలోని గ్రామాలు: Chandanagar, Darga Hussainshahwal, Gachibowli, Gafoornagar, Gopanpalli, Guttala Begumpet, Hafeezpet, Izzathnagar, Khajaguda, Khanammet, Kondapur, Kothaguda, Madeenaguda, Madhapur, Maktha Mahabubpet, Miyapur, Nalagandla, Nanakramguda, Raidurg Khalsa, Raidurg Nowkhalsa, Raidurg Paigah, Raidurg Panmaktha, Ramannaguda, Serilingampalle (M), Serinalagandla, Taranagar
= = = = =
సంప్రదించిన పుస్తకాలు, వెబ్‌సైట్లు:
|
Tags:
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి