మర్రిగూడ నల్గొండ జిల్లాకు చెందిన మండలము. ఇది దేవరకొండ రెవెన్యూ డివిజన్, మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గం, భువనగిరి లోకసభ నియోజకవర్గంలో పరిధిలోకి వస్తుంది. మండలంలో 17 రెవెన్యూ గ్రామాలు, 15 గ్రామపంచాయతీలు కలవు. విమోచనోద్య పోరాటయోధులు పొనుగోటి మాధవరావు, పండ్రప్రగడ శ్రీధరరావు, మార్నేని మేల్కి ఈ మండలానికి చెందినవారు.
సరిహద్దులు: ఈ మండలానికి ఈశాన్యాన మరియు తుర్పున చండూరు మండలం, దక్షిణాన నాంపల్లి మరియు చింతపల్లి మండలాలు, పశ్చిమాన రంగారెడ్డి జిల్లా, ఉత్తరాన యాదాద్రి భువనగిరి జిల్లాకు సరిహద్దులుగా ఉన్నాయి. జనాభా: 2001 లెక్కల ప్రకారం మండల జనాభా 36946, 2011 నాటికి జనాభా 393 తగ్గి 36553 కు చేరింది. ఇందులో పురుషులు 18608, మహిళలు 17945. మండలంలోని గ్రామాలు: Anthampet, Bhatlapally, Damera Bheemanapally, Indurthy, Khudabakshpally, Kondur, Lenkalapally, Marriguda, Metichandapur, Namapur, Sarampet, Somarajguda, Tammadapally, Tirugandlapally, Vattipally, Venkepally , Yerugandlapally ఇవి కూడా చూడండి:
= = = = =
సంప్రదించిన పుస్తకాలు, వెబ్‌సైట్లు:
|
tags: Marriguda Mandal in telugu, nalgonda Dist Mandals in telugu,
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి