అంతర్గాం పెద్దపల్లి జిల్లాకు చెందిన మండలము. అక్టోబరు 11, 2016న ఈ మండలం కొత్తగా ఏర్పడింది. రామగుండం మండలంలోని 14 గ్రామాలను విడదీసి అంతర్గాం కేంద్రంగా మండలాన్ని ఏర్పాటుచేశారు. అంతకుక్రితం కరీంనగర్ జిల్లాలో ఉన్న ఈ ప్రాంతం కొత్తగా ఏర్పాటైన పెద్దపల్లి జిల్లాలో చేరింది. ఇది పెద్దపల్లి రెవెన్యూ డివిజన్, రామగుండం అసెంబ్లీ నియోజకవర్గం, పెద్దపల్లి లోకసభ నియోజకవర్గంలో భాగముగా ఉన్నది. ఎల్లంపల్లి (శ్రీపాద ప్రాజెక్టు), మార్ముర్ ఎత్తిపోతలను ఈ మండలంలోనే నిర్మిస్తున్నారు. సికింద్రాబాదు-ఢిల్లీ రైలు మార్గం మండలం గుండా వెళ్ళుచున్నది. మండలంలో 5 ఎంపీటీసి స్థానాలు, 14 గ్రామపంచాయతీలు, 14 రెవెన్యూ గ్రామాలు కలవు.
భౌగోళికం, సరిహద్దులు: ఈ మండలం పెద్దపల్లి జిల్లాలో ఉత్తరాన మంచిర్యాల మరియు జగిత్యాల జిల్లా సరిహద్దులో ఉంది. తూర్పున రామగుడం మండలం, దక్షిణాన మరియు పశ్చిమాన పాలకుర్తి మండలం, ఉత్తరాన మంచిర్యాల జిల్లా, వాయువ్యాన జగిత్యాల జిల్లా సరిహద్దులుగా ఉన్నాయి. ఉత్తర సరిహద్దు గుండా గోదావరి నది ప్రవహిస్తోంది. రవాణా సౌకర్యాలు: కాజీపేట బల్హార్షా రైలుమార్గం, కరీంనగర్-మంచిర్యాల ప్రధాన రహదారి మండలం గుండా వెళ్ళుచున్నాయి. రాజకీయాలు: ఈ మండలము రామగుండం అసెంబ్లీ నియోజకవర్గం, పెద్దపల్లి లోకసభ నియోజకవర్గంలో భాగముగా ఉన్నది. 2019 ఎన్నికలలో మండల అధ్యక్షులుగా తెరాసకు చెందిన దుర్గం విజయ, జడ్పీటీసిగా తెరాసకు చెందిన అముల నారాయణ ఎన్నికయ్యారు. మండలంలోని గ్రామాలు: Akenapalli, Anthergaon, Brahmanpalli, Eklaspur, Goilwada, Kundanpalli, Lingapur, Maddiriyala, Mogalpahad, Murmur, Potyala, Raidandi, Somanapalli, Yellampalli ఇది కూడా చూడండి:
ముఖ్యమైన గ్రామాలు:
మార్ముర్ (Marmur):ఫిబ్రవరి 27, 2018న ముఖ్యమంత్రి కేసిఆర్ చే మార్ముర్ వద్ద ఎత్తిపోతల నిర్మాణానికి శంకుస్థాపన చేయబడింది. ఇది ఎల్లంపల్లి ఎత్తిపోతల పథకంగా పిల్వబడుతుంది. ఎల్లంపల్లి (Yellampally): ఎల్లంపల్లి అంతర్గాం మండలమునకు చెందిన గ్రామము. ఇక్కడ ఎల్లంపల్లి (శ్రీపాదసాగర్) ప్రాజెక్టును నిర్మిస్తున్నారు.
= = = = =
సంప్రదించిన పుస్తకాలు, వెబ్‌సైట్లు:
|
Tags: Anthergoan Mandal, Antargam Mandal, Peddapalli Dist Mandals in Telugu, Godavari River, Peddapalli Revenue Division, Ramagundam Assebly Constituency, Peddapalli Loksabha Constituency, new mandals in Telangana
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి