ఎల్లారెడ్డిపేట రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన మండలము. మండలంలో 13 ఎంపీటీసి స్థానాలు, 24 గ్రామపంచాయతీలు, 16 రెవెన్యూ గ్రామాలు కలవు. ఈ మండలం జిల్లాలో పశ్చిమ భాగంగా నిజామాబాదు జిల్లా సరిహద్దులో ఉంది. మండలం దక్షిణ సరిహద్దు గుండా మానేరునది ప్రవహిస్తోంది. కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు పొందిన ప్రముఖ రచయిత నలిమెల భాస్కర్ ఈ మండలమునకు చెందినవారు.
అక్టోబరు 11, 2016కు ముందు ఈ మండలం కరీంనగర్ జిల్లాలో భాగంగా ఉండేది. జిల్లాల పునర్వ్యవస్థీకరణ సమయంలో కొత్తగా ఏర్పడిన రాజన్న సిరిసిల్ల జిల్లాలో భాగమైంది. అదేసమయంలో ఈ మండలం నుంచి 6 రెవెన్యూ గ్రామాలను విడదీసి కొత్తగా వీర్నపల్లి మండలాన్ని ఏర్పాటుచేశారు. భౌగోళికం, సరిహద్దులు: ఈ మండలానికి ఉత్తరాన కోనారావుపేట మండలం మరియు వీర్నపల్లి మండలం, తూర్పున సిరిసిల్ల మండలం, దక్షిణా ముస్తాబాదు మండలం, పశ్చిమాన మరియు నైరుతిన గంభీరావుపేట మండలం సరిహద్దులుగా ఉన్నాయి. జనాభా: 2011 లెక్కల ప్రకారం మండల జనాభా 59699. ఇందులో పురుషులు 29609, మహిళలు 30090. అక్షరాస్యుల సంఖ్య 32317. రాజకీయాలు: ఈ మండలము సిరిసిల్ల అసెంబ్లీ నియోజకవర్గం, కరీంనగర్ లోకసభ నియోజకవర్గంలో భాగంగా ఉంది. 2019లో మండల అధ్యక్షులుగా తెరాసకు చెందిన పిల్లి రేణుక, జడ్పీటీసిగా తెరాసకు చెందిన చీటి లక్ష్మన్‌రావు ఎన్నికైనారు. రవాణా సౌకర్యాలు: కామారెడ్డి నుంచి కరీంనగర్ వెళ్ళు ప్రధాన రహదారి మండలం మీదుగా పోతుంది. .
ఎల్లారెడ్డిపేట మండలం కై బ్లాగులో గూగుల్ సెర్చ్ చేయండి
మండలంలోని రెవెన్యూ గ్రామాలు: Akkapalli, Almaspur, Bandalingampalli, Boppapur, Dumala, Gollapalli, Gundaram, Korutlapet, Narayanapur, Padira, Pothareddypalli, Rajannapet, Sarvaipally (UIH), Singaram, Thimmapur, Venkatapur, Yellareddypet,
ప్రముఖ గ్రామాలు / పట్టణాలు
నారాయణపూర్ (Narayanapur): నారాయణపూర్ రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలమునకు చెందిన గ్రామము. 2013 సం.కిగాను అనువాద ప్రక్రియలో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు పొందిన ప్రముఖ రచయిత నలిమెల భాస్కర్ ఈ గ్రామమునకు చెందినవారు.
ఇవి కూడా చూడండి:
= = = = =
సంప్రదించిన పుస్తకాలు, వెబ్‌సైట్లు:
|
Yellareddypet Mandal in Telugu, Rajanna Sirisilla Dist (district) Mandals in telugu, Rajanna Sirisilla Dist Mandals in telugu,
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి