26, జనవరి 2019, శనివారం

ప్రణబ్ ముఖర్జీ (Pranab Mukherjee)

జననండిసెంబరు 11, 1935
స్వస్థలంమిరాఠీ (పశ్చిమబెంగాల్)
పదవులురాష్ట్రపతి, కేంద్రమంత్రి, ప్రణాళిక సంఘం డిప్యూటి చైర్మెన్
గుర్తింపులుభారతరత్న (2019), పద్మవిభూషణ్ (2008)
మరణం
ఆగస్టు 31, 2020
ప్రముఖ రాజకీయ నాయకుడు, రాష్ట్రపతిగా పనిచేసిన ప్రనబ్ ముఖర్జీ డిసెంబరు 11, 1935న మిరాఠీ (పశ్చిమబెంగాల్) లో జన్మించారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన ప్రణబ్ ముఖర్జీ కేంద్రంలో ఆర్థిక, రక్షణ, విదేశాంగ తదితర ముఖ్యమైన మంత్రిత్వ శాఖలను నిర్వహించారు. ఆగస్టు 31, 2020న మరణించారు.

ఇందిరాగాంధీ హయంలో 1973లో తొలిసారిగా కేంద్రంమంత్రిమండలిలో స్థానం పొందిన ప్రణబ్ ముఖర్జీ ఇందిర మరణం తర్వాత అనుభవం లేని రాజీవ్‌గాంధీని ప్రధానిగా చేయడాన్ని తప్పుపట్టి కాంగ్రెస్ పార్టీకి దూరమై 1986లో రాష్ట్రీయ సమాజ్‌వాది కాంగ్రెస్ పార్టీని స్థాపించారు. కాని 1989లో కాంగ్రెస్ పార్టీలో విలీనం చేశారు. రాజీవ్ గాంధీ మరణానంతరం మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో చురుకైన పాత్రవహించి పలు ఉన్నతమైన పదవులు పొందారు. పి.వి. నరసింహరావు కాలంలో 1991లో ప్రణాళిక సంఘం డిప్యూటి చైర్మెన్‌గా నియమించబడ్డారు. 2012లో రాష్ట్రపతి ఎన్నికలలో ప్రణబ్ ముఖర్జీ పి.ఏ.సంగ్మాపై విజయం సాధించి భారత 13వ రాష్ట్రపతిగా అధికారం స్వీకరించారు.

ఈయన సేవలకు గుర్తింపుగా 2008లో పద్మవిభూషణ్ పురస్కారం, 2013లో బంగ్లాదేశ్ లిబరేషన్ వార్ హానర్ పురస్కారం, 2019లో అత్యున్నతమైన భారతరత్న పురస్కారాలు లభించాయి.

ఇవి కూడా చూడండి:

హోం,
విభాగాలు: భారత రాష్ట్రపతులు, కేంద్రమంత్రులు, పశ్చిమబెంగాల్ ప్రముఖులు, భారతరత్న పురస్కార గ్రహీతలు, కేంద్ర ఆర్థికమంత్రులు,


 = = = = =


About Pranab Mukherjee,

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక