27, ఏప్రిల్ 2020, సోమవారం

నందన్ నీలేకని (Nandan Nilekani)

నందన్ నీలేకని
జననంజూన్ 2, 1955
రంగంవాణిజ్యవేత్త, బ్యూరోక్రాట్‌, రాజకీయనాయకుడు
అవార్డులుపద్మభూషణ్
వాణిజ్యవేత్తగా, బ్యూరోక్రాట్‌గా, రాజకీయనాయకుడిగా పేరుపొందిన నందన్ నీలేకని జూన్ 2, 1955న బెంగుళూరులో జన్మించారు. 1978లో ఒక సాఫ్ట్‌వేర్ సంస్థలో ఉద్యోగిగా చేరి 1981లో బయటపడి, మరో నలుగురితో కలిసి ఇన్ఫోసిస్ సంస్థను స్థాపించారు. ఇన్ఫోసిసి వ్యవస్థాపకులలో ఒకరిగా 2002-07 కాలంలో ఇన్ఫోసిసి CEOగా పనిచేశారు. 2017లో ఇన్ఫోసిస్ నుంచి బయటికి వచ్చారు. 2014లో కాంగ్రెస్ తరఫున బెంగుళూరు సౌత్ నుంచి లోక్‌సభకు పోటీచేసి భాజపా చేతిలో ఓడిపోయారు. 2014 ఎన్నికల సమయంలో వెల్లడించిన ఆస్తుల ప్రకారం ఈయన ఆ సంవత్సరం పోటీచేసిన వారిలో అతి సంపన్నుడు (రూ 7710 కోట్లు). UIDAI (ఆధార్) చైర్మెన్‌గా పనిచేశారు. తన సేవలకుగాను పలు అవార్డులు పొందారు.

గుర్తింపులు:
2005లో జోసెఫ్ షుంపీటర్ ప్రైజ్ పొందారు
2006లో పద్మభూషణ్ పురస్కారం పొందారు
2006లోనే ఫోర్బ్స్‌ ఆసియాచే బిజినెస్ మ్యాన్ ఆఫ్ ది ఇయర్ గా గుర్తింపు పొందారు
2009లో టైమ్‌ పత్రిక వెల్లడించిన 100 ప్రపంచపు ప్రభావశీరులలైన వ్యక్తులలో ఒకరిగా స్థానం పొందారు
2017లో ఇండియాటుడేచే ప్రకటించబడ్డ 50 శక్తిమంతులైన భారతీయులలో 12వ స్థానం పొందారు

హోం
విభాగాలు: కర్ణాటక ప్రముఖులు,


 = = = = =


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక