మనూరు సంగారెడ్డి జిల్లాకు చెందిన మండలము. మండలంలో 45 రెవెన్యూ గ్రామాలు కలవు. ఈ మండలం నారాయణఖేడ్ రెవెన్యూ డివిజన్, నారాయణఖేడ్ అసెంబ్లీ నియోజకవర్గం, జహీరాబాదు లోక్‌సభ నియోజకవర్గంలో భాగంగా ఉంది. 2011 లెక్కల ప్రకారం మండల జనాభా 59453.
మెదక్ జిల్లాలో ఉండిన ఈ మండలం అక్టోబరు 11, 2016న కొత్తగా ఏర్పడిన సంగారెడ్డి జిల్లాలో భాగమైంది. అక్టోబరు 11, 2016న మనూరు మండలంలోని 21 గ్రామాలను విడదీసి కొత్తగా నాగల్‌గిద్ద మండలాన్ని ఏర్పాటుచేశారు. భౌగోళికం, సరిహద్దులు: ఈ మండలానికి ఉత్తరాన నాగిల్‌గిద్ద మరియు నారాయణఖేడ్ మండలాలు, దక్షిణాన రాయికోడ్ మండలం, నైరుతిన న్యాలకల్ మండలం, తూర్పున మెదక్ జిల్లా, పశ్చిమాన కర్ణాటక రాష్ట్రం సరిహద్దులుగా ఉన్నాయి. జనాభా: 2001 లెక్కల ప్రకారం మండల జనాభా 52836. ఇందులో పురుషులు 27199, మహిళలు 25637. 2011 లెక్కల ప్రకారం మండల జనాభా 59453. ఇందులో పురుషులు 30407, మహిళలు 29046. అక్షరాస్యుల సంఖ్య 25659. రాజకీయాలు: ఈ మండలము నారాయణఖేడ్ అసెంబ్లీ నియోజకవర్గం, జహీరాబాదు లోకసభ నియోజకవర్గంలో భాగముగా ఉన్నది.
మనూరు మండలం కై బ్లాగులో గూగుల్ సెర్చ్ చేయండి
మండలంలోని రెవెన్యూ గ్రామాలు:Athimial, Badalgaon, Bellapur, Borancha, Danvar, Davvur, Dosapally, Dudgonda, Gatlingampally, Islampur, Kamalapur, Magdumpur, Maikode, Manoor, Nadigadda Hukrana, Pulkurthy, Raipally, Ranapur, Shelgera, Thornal, Timmapur, Tumnoor, Usirkapally, Yelgoi
ప్రముఖ గ్రామాలు
బోరంచ (Borancha):బోరంచ సంగారెడ్డి జిల్లా మనూరు మండలమునకు చెందిన గ్రామము. ఇక్కడ నల్లపోచమ్మ ఆలయం ఉంది. ఈ ప్రాంతం కర్ణాటక, మహారాష్ట్ర సరిహద్దులో ఉంది. ఏటా వేసవిలో జాతర ఉత్సవాలు నిర్వహిస్తారు. ఇక్కడి అమృతగుండంలో స్నానాలు చేసే రోగాలు పోతాయనే నమ్మకం భక్తులలో ఉంది. 3సార్లు ఖేడ్ ఎమ్మెల్యేగా ఎన్నికైన పి.కిష్టారెడ్డి ఈ గ్రామానికి ఇల్లరికపు అల్లుడిగా వచ్చాడు. 2001 లెక్కల ప్రకారం గ్రామ జనాభా 2517. శాపూర్ (Shapur): శాపూర్ సంగారెడ్డి జిల్లా మనూరు మండలమునకు చెందిన గ్రామము. ఇక్కడ మంజీరా నదిపై నెదర్లాండ్స్ దేశ సహకారంతో 15 సం.ల క్రితం 29 గ్రామాల దాహార్తిని తీర్చేందుకు పథకాన్ని నెలకొల్పారు. మనూరు, నారాయణఖేడ్ మండలాల్లోని 28 గ్రామాలకు ఈ పథకం ద్వారా త్రాగునీటిని అందిస్తారు. ఇవి కూడా చూడండి:
= = = = =
సంప్రదించిన పుస్తకాలు, వెబ్‌సైట్లు:
|
About Manoor Manur Mandal Sangareddy Dist (district) Mandal in telugu, Sanga Reddy Dist Mandals in telugu,
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి