నారాయణఖేడ్ సంగారెడ్డి జిల్లాకు చెందిన మండలము. మండలంలో 35 రెవెన్యూ గ్రామాలు కలవు. 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన పట్లోళ్ల కిష్టారెడ్డి, 2009లో జహీరాబాదు ఎంపిగా విజయం సాధించిన సురేష్ షెట్కార్ ఈ మండలమునకు చెందినవారు. మెదక్ జిల్లాలో ఉండిన ఈ మండలం అక్టోబరు 11, 2016న కొత్తగా ఏర్పడిన సంగారెడ్డి జిల్లాలో భాగమైంది.
భౌగోళికం, సరిహద్దులు: ఈ మండలానికి ఉత్తరాన కల్హేర్ మరియు సిర్గాపూర్ మండలాలు, దక్షిణాన మనూరు మండలం, పశ్చిమాన నాగిల్‌గిద్ద మండలం, తూర్పున మెదక్ జిల్లా సరిహద్దులుగా ఉన్నాయి. జనాభా: 2011 లెక్కల ప్రకారం మండల జనాభా 82082. ఇందులో పురుషులు 41647, మహిళలు 40435. అక్షరాస్యుల సంఖ్య 39739. పట్టణ జనాభా 15575, గ్రామీణ జనాభా 66507. రాజకీయాలు: ఈ మండలం నారాయణఖేడ్ ఆందోల్ నియోజకవర్గం, జహీరాబాదు లోకసభ నియోజకవర్గంలో భాగంగా ఉన్నది. 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన పట్లోళ్ల కిష్టారెడ్డి, 2009లో జహీరాబాదు ఎంపిగా విజయం సాధించిన సురేష్ షెట్కార్ ఈ మండలమునకు చెందినవారు.. మండలంలోని రెవెన్యూ గ్రామాలు: Abenda, Allapur, Ananthasagar, Anthwar, Bhanapur, Chandapur, Chandkhanpally, Chaptakhadeem, Gadthi Hokrana, Gangapur, Hangarga [B], Hangarga [K], Hanmanthraopet, Jagannathpur, Jukal, Juzalpur, Kamjipoor, Kondapur, Lingapur, Madhavar, Mansoorpur, Nagapur, Namalimet, Narasapur, Narayankhed, Nizampet, Paidpally, Panchagaon, Pipri, Rudrar, Ryakal, Ryalamadugu, Sanjivanrao Pet, Sathagaon, Venkatapur
ప్రముఖ గ్రామాలు
నారాయణఖేడ్ (Narayankhed)::నారాయణఖేడ్ సంగారెడ్డి జిల్లాకు చెందిన పట్టణము మరియు మండలకేంద్రము. ఇక్కడ ఆర్టీసి డిపో ఉంది. 2009లో జహీరాబాదు ఎంపిగా విజయం సాధించిన సురేష్ షెట్కార్ ఈ గ్రామమునకు చెందినవారు. పంచగామ (Panchagama): పంచగామ సంగారెడ్డి జిల్లా నారాయణ్‌ఖేడ్ మండలమునకు చెందిన గ్రామము. పంచవటిగా పేరుగాంచిన ఈ గ్రామంలో ప్రసిద్ధి చెందిన శనీశ్వరాలయం ఉంది. 1989, 1999, 2004, 2014లలో ఖేడ్ ఎమ్మెల్యేగా ఎన్నికైన పి.కిష్టారెడ్డి స్వగ్రామం. ఇతను 1975లో పంచగామ సర్పంచిగా ఎన్నికయ్యారు. తాలుకా అధ్యక్షునిగా, ప్రభుత్వ న్యాయవాదిగా పనిచేశారు. ఇవి కూడా చూడండి:
= = = = =
సంప్రదించిన పుస్తకాలు, వెబ్‌సైట్లు:
|
About Narayankhed Mandal Sangareddy Dist (district) Mandal in telugu, Sanga Reddy Dist Mandals in telugu,
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి