న్యాలకల్ సంగారెడ్డి జిల్లాకు చెందిన మండలము. ఈ మండలం జహీరాబాదు రెవెన్యూ డివిజన్, జహీరాబాదు అసెంబ్లీ నియోజకవర్గం, జహీరాబాదు లోకసభ నియోజకవర్గంలో భాగంగా ఉన్నది. జహీరాబాదు-బీదర్ ప్రధాన రహదారి మరియు వికారాబాదు-బీదర్ రైలుమార్గం మండలం మీదుగా వెళ్ళుచున్నాయి. మంజీరానది కూడా మండలం మీదుగా ప్రవహిస్తున్నది. మండలంలో 39 రెవెన్యూ గ్రామాలు కలవు. మండలంలోని రేజింతల్ గ్రామంలో స్వయంభూగా వెలిసిన గణపతి ఆలయం ఉంది.
మెదక్ జిల్లాలో ఉండిన ఈ మండలం అక్టోబరు 11, 2016న కొత్తగా ఏర్పడిన సంగారెడ్డి జిల్లాలో భాగమైంది. భౌగోళికం, సరిహద్దులు: ఈ మండలం సంగారెడ్డి జిల్లాలో పశ్చిమాన కర్ణాటక సరిహద్దులో ఉంది. ఈ మండలానికి ఈశాన్యాన మనూరు మండలం, తూర్పున రాయికోడ్ మండలం మరియు ఝరాసంగం మండలం, దక్షిణాన జహీరాబాదు మండలం, పశ్చిమాన కర్ణాటక రాష్ట్రం సరిహద్దులుగా ఉన్నాయి. జనాభా: 2011 లెక్కల ప్రకారం మండల జనాభా 57358. ఇందులో పురుషులు 28972, మహిళలు 28386. అక్షరాస్యుల సంఖ్య 29872. రవాణా సౌకర్యాలు: జహీరాబాదు నుంచి బీదర్ వెళ్ళు ప్రధాన రహదారి మండలం మీదుగా వెళ్ళుచున్నది. వికారాబాదు-బీదర్ రైలుమార్గం కూడా మండలం పశ్చిమ భాగం నుంచి పోవుచున్నది. రాజకీయాలు: ఈ మండలం జహీరాబాదు నియోజకవర్గం, జహీరాబాదు లోకసభ నియోజకవర్గంలో భాగంగా ఉన్నది. మండలంలోని రెవెన్యూ గ్రామాలు: Ameerabad, Atnur, Basanthpur, Chalki, Cheekurthi, Chingepally, Dappur, Ganeshpur, Gangwar, Gunjetti, Hadnur, Humnapur, Hussainnagar, Husselli, Ibrahimpur, Kakijanwada, Kalbemal, Khaleelpur[M], Malgi, Malkanpahad, Mamidgi, Mariampur, Metalkunta, Mirjapur[N], Mirzapur[B], Mungi, Murthujapur, Naimatabad, Nyalkal, Raghavapur, Rajola, Ramtheerth, Ratnapur, Rejinthal, Rukmapur, Shamshullapur, Tatpally, Tekur, Waddi
ప్రముఖ గ్రామాలు
రాఘవాపూర్ (Raghavapur): రాఘవాపూర్ సంగారెడ్డి జిల్లా న్యానకల్ మండలమునకు చెందిన గ్రామము. గ్రామ శివారులో ఉన్న పంచవటి క్షేత్రంలో వసంత పంచమి ఘనంగా నిర్వహిస్తారు. ఇది మంజీరానది ఒడ్డున ఉంది. రేజింతల్ (Rejinthal): రేజింతల్ సంగారెడ్డి జిల్లా న్యానకల్ మండలమునకు చెందిన గ్రామము. ఇక్కడ స్వయంభూగా వెలిసిన గణపతి ఆలయం ఉంది. ఏటా బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు. తెలంగాణలోనే ప్రఖ్యాతి చెందిన గణపతి ఆలయంగా ఖ్యాతి చెందింది. ఇవి కూడా చూడండి:
= = = = =
సంప్రదించిన పుస్తకాలు, వెబ్‌సైట్లు:
|
About Nyalakal Mandal Sangareddy Dist (district) Mandal in telugu, Sanga Reddy Dist Mandals in telugu,
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి