రాయికోడ్ సంగారెడ్డి జిల్లాకు చెందిన మండలము. మండలంలో 37 రెవెన్యూ గ్రామాలు కలవు. ఈ మండలం జహీరాబాదు రెవెన్యూ డివిజన్, ఆందోల్ అసెంబ్లీ నియోజకవర్గం, జహీరాబాదు లోకసభ నియోజకవర్గంలో భాగంగా ఉన్నది. మండలపు తూర్పు సరిహద్దు గుండా మంజీరానది ప్రవహిస్తోంది. మండల పరిధిలో హస్నాబాద్ ప్రాజెక్టు, బొగ్గులంపల్లిలో ఎత్తిపోతల పథకం ఉంది. మెదక్ జిల్లాలో ఉండిన ఈ మండలం అక్టోబరు 11, 2016న కొత్తగా ఏర్పడిన సంగారెడ్డి జిల్లాలో భాగమైంది.
భౌగోళికం, సరిహద్దులు: ఈ మండలానికి ఉత్తరాన మనూరు మండలం, తూర్పున వట్‌పల్లి మండలం, దక్షిణాన మునిపల్లి మండలం మరియు ఝరాసంగం మండలం, పశ్చిమాన న్యాలకల్ మండలం సరిహద్దులుగా ఉన్నాయి. తూర్పు సరిహద్దులో మంజీరానది ప్రవహిస్తోంది. జనాభా: 2011 లెక్కల ప్రకారం మండల జనాభా 40672. ఇందులో పురుషులు 20951, మహిళలు 19721. అక్షరాస్యుల సంఖ్య 19911. రాజకీయాలు: ఈ మండలం ఆందోల్ నియోజకవర్గం, జహీరాబాదు లోకసభ నియోజకవర్గంలో భాగంగా ఉన్నది. మండలంలోని రెవెన్యూ గ్రామాలు: Allapur, Auranganagar (Patti Hasnabad), Chimnapur (DP), Dharmapur, Doultabad, Hasnabad, Hulgera, Indoor, Itkepally, Jamalpur (DP), Jamgi (Khurd), Karchal, Khanjamalpur, Khudavanadpoor (DP), Kodoor, Kushnoor, Madhapur , Mahbathpur, Mamidipally, Matoor, Mohammadapur, Moratga, Mustafapur, Naganpally, Nagwar, Nallampally, Pampad, Peapalpally, Raikode, Raipally [Patti Karchal], Sangapur, Shamshuddinpur, Shapur, Singitham, Sirur, Yenkepally, Yousufpur
ప్రముఖ గ్రామాలు
బొగ్గులంపల్లి (Boggulampalli): మంజీరానది తీరంలోని బొగ్గులంపల్లి శివారులో 2012లో ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించారు. 3వేల ఎకరాలకు నీరు అందించడం ఈ ఎత్తిపోతల ఉద్దేశ్యం. ఇవి కూడా చూడండి:
= = = = =
సంప్రదించిన పుస్తకాలు, వెబ్‌సైట్లు:
|
About Raikode Mandal Sangareddy Dist (district) Mandal in telugu, Sanga Reddy Dist Mandals in telugu,
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి