శంకరంపేట-ఏ మండలం మెదక్ జిల్లాకు చెందిన మండలము. ఈ మండలం మెదక్ రెవెన్యూ డివిజన్, నారాయణ్‌ఖేడ్ అసెంబ్లీ నియోజకవర్గం, జహీరాబాదు లోక్‌సభ నియోజకవర్గంలో భాగంగా ఉంది. మండలంలో 25 రెవెన్యూ గ్రామాలు కలవు. మండల కేంద్రం శంకరంపేటలో మహారాజ్ఞి రాయబాగిన్ రాణి శంకరమ్మ కాలం నాటి ప్రాచీన రాజసౌధాలు, కోటబురుజులు గ్రామంలో ఇప్పటికీ కనిపిస్తాయి.
భౌగోళికం, సరిహద్దులు: ఈ మండలం మెదక్ జిల్లాలో ఉత్తరాన కామారెడ్డి జిల్లా సరిహద్దులో ఉంది. తూర్పున పాపన్నపేట, టేక్మల్ మండలాలు, దక్షణాన అల్లాదుర్గ్ మండలం, నైరుతిన రేగోడ్ మండలం, పశ్చిమాన సంగారెడ్డి జిల్లా, ఉత్తరాన కామారెడ్డి జిల్లా సరిహద్దుగా ఉంది. రాజకీయాలు: ఈ మండలం నారాయణ్‌ఖేడ్ అసెంబ్లీ నియోజకవర్గం, జహీరాబాదు లోక్‌సభ నియోజకవర్గంలో భాగంగా ఉంది. మండలంలోని రెవెన్యూ గ్రామాలు: Baddaram, Burugupally, Ch.Laxmapur (DP), Cheelapally, Danampally, Gottimukla, Jambikunta, Jukal, Kamalapur, Kollapally, Koppole (DP), Kothapet, Maktha Lakshmapur, Malkapur, Marshetpally, Musapet, Narayanapally, Ramajipally, Shankarampet (A) , Shivaipally, Tenkati, Thirumalapur, Uthloor, Venkatapur (Kattela), Virojipally
ప్రముఖ గ్రామాలు
శంకరంపేట-ఏ (Shankarampet R):శంకరంపేట-ఏ మెదక్ జిల్లాకు చెందిన గ్రామము మరియు మండల కేంద్రం. రాణి శంకరమ్మ కాలంనాటి రాజసౌధాలు, కోటబురుజులు గ్రామంలో ఉన్నాయి. క్రీ.శ.1720-60 వరకు పాలించిన నరసింహారెడ్డి భార్య శంకరమ్మ కూడా 1764 నుంచి ఈ ప్రాంతాన్ని పాలించింది. ఆమె పేరుమీదుగా నిర్మించిన ఈ గ్రామానికి శంకరంపేట పేరువచ్చింది. ఇవి కూడా చూడండి:
= = = = =
సంప్రదించిన పుస్తకాలు, వెబ్‌సైట్లు:
|
About Shankarampet A Mandal Medak Dist (district) Mandal in telugu, Medak Dist Mandals in telugu,
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి