28, మే 2019, మంగళవారం

ఆస్ట్రేలియా (Australia)

రాజధానికాన్‌బెర్రా
వైశాల్యం76.92 లక్షల చకిమీ
జనాభా2.5 కోట్లు
కరెన్సీఆస్ట్రేలియన్ డాలర్
ప్రపంచంలో ఆరవ పెద్ద దేశము మరియు ఓషియానాలో పెద్దదేశమైన ఆస్ట్రేలియా దక్షిణార్థగోళంలో హిందూ మహాసముద్రం మరియు పసిఫిక్ మహాసముద్రం మధ్యన ఉంది. 76.92 లక్షల చకిమీ వైశాల్యం, 2.5 కోట్ల జనాభా కల్గిన ఈ దేశ రాజధాని కాన్‌బెర్రా. ఈ దేశపు ప్రధాన నగరాలు తీరప్రాంతాలలో ఉండటం ప్రత్యేకత. సిడ్నీ, మెల్బోర్న్, బ్రిస్‌బేన్, పెర్త్, అడిలైడ్, గోల్డ్‌కోస్ట్ ఈ దేశపు ప్రధాన నగరాలు. ఆస్ట్రేలియా జాతీయ భాష ఇంగ్లీష్, కరెన్సీ ఆస్ట్రేలియన్ డాలర్. పారిశ్రామికంగా అభివృద్ధి చెందిన దేశాలలో ఒకటిగా ఆస్ట్రేలియా పేరుపొందింది. ఈ దేశ తలసరి ఆదాయం ప్రపంచదేశాలలో 10వ స్థానంలో ఉంది. క్రికెట్, ఫుట్‌బాల్, రగ్బీ ఈ దేశపు ప్రజాదరణ పొందిన క్రీడలు.

భౌగోళికం:
ఈ దేశం దక్షిణార్థగోళంలో 9° నుంచి 44° దక్షిణ అక్షాంశాలు, 112° నుంచి 154° తూర్పు రేఖాంశాల మధ్యన ఉంది. హిందూమహాసముద్రం మరియు పసిఫిక్ మహాసముద్రాల మధ్యన 76.92 లక్షల చకిమీ వైశాల్యంతో ప్రపంచంలో ఆరవ పెద్ద దేశంగా ఉంది. తూర్పుభాగంలో గ్రేట్ డివైడింగ్ రేంజ్ పర్వతాలు విస్తరించియున్నాయి. సుమారు మూడున్నర కిలోమీటర్ల ఎత్తులో ఉన్న మెకిన్లీ పర్వత శిఖరం ఆస్ట్రేలియాలో ఎత్తయిన శిఖరంగా పేరుపొందింది.

చరిత్ర:
సుమారు 65వేల సం.ల క్రిందటే మానవులు నివశించిన అబోరిజియన్ ఆస్ట్రేలియన్ సంస్కృతి ఆధారాలు ఆస్ట్రేలియాలో బయటపడ్డాయి. ఆధునిక కాలంలో డచ్చివారు ఆస్ట్రేలియా ఖండం వచ్చిన తొలి విదేశీయులుగా పరిగణించబడతారు. అమెరికాను కోల్పోయిన తర్వాత బ్రిటీష్ ప్రభుత్వం ఆస్ట్రేలియాపై దృష్టిపెట్టడంతో 1788 జనవరి 26 నాడు సిడ్నీపై జెండా ఎగురవేశారు. ఈ దినం ఇప్పటికీ ఆస్ట్రేలియా దినోత్సవంగా జరుపబడుతుంది. 1901లో బ్రిటీష్ సామ్రాజ్యంలో భాగమై ఇప్పటికీ బ్రిటన్ రాణిని ఆస్ట్రేలియా అధిపతిగా పరిగణించడం జరుగుతోంది.

క్రీడలు:
క్రికెట్, ఫుట్‌బాల్, రగ్బీ ఆటలు ఇక్కడి జనాదరణ పొందిన క్రీడలు. వన్డే క్రికెట్ ప్రపంచకప్‌ను ఆస్ట్రేలియా జట్టు అత్యధికంగా 5 సార్లు గెలుచుకుంది. ఒలింపిక్ క్రీడలలో ఆస్ట్రేలియా ఇపటివరకు 152 స్వర్ణపతకాలు సాధించింది. 1956 మరియు 2000లలో మెల్బోర్న్, సిడ్నీలలో ఒలింపిక్ క్రిడలను కూడా నిర్వహించింది.

ఇవి కూడా చూడండి:
  • ఆస్ట్రేలియా ఖండం,
  • ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు,

Home
విభాగాలు: ప్రపంచదేశాలు, ఆస్ట్రేలియా,


 = = = = =


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక