17, మే 2019, శుక్రవారం

ఆస్ట్రియా (Austria)

ఆస్ట్రియా
రాజధానివియన్నా
కరెన్సీయూరో
వైశాల్యం83,879 చకిమీ
జనాభా88 లక్షలు
ఆస్ట్రియా యూరప్ ఖండానికి చెందిన భూపరివేష్ఠిత దేశము. వియన్నా ఈ దేశ రాజధాని మరియు పెద్ద పట్టణము. దేశ భూభాగం అధికంగా ఆల్ప్స్ పర్వతాలలో భాగంగా ఉంది. దేశ వైశాల్యం 83,879 చకిమీ మరియు జనాభా 88 లక్షలు. ఆధునిక యూరప్ చరిత్రలో ఆస్ట్రియా ప్రముఖ పాత్ర వహించింది. పారిశ్రామికంగా బాగా అభివృద్ధి చెందిన ఆస్ట్రియా యొక్క జాతీయాదాయం కూడా అధికంగా ఉంది. డాన్యూబ్ నది దేశం గుండా ప్రవహిస్తోంది. ప్రస్తుతం ఆస్ట్రియా యూరోపియన్ యూనియన్‌లో భాగంగా ఉంది. ఈ దేశానికి చెందిన కుర్ట్ వాల్దీమ్‌ 1986 -1992 కాలంలో ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు.

చరిత్ర:
పూర్వం ఆస్ట్రియా భూభాగంలో చెకొస్లోవేకియా, హంగేరీ, యుగస్లోవేకియాలు కూడా భాగంగా ఉండేవి. క్రీ.శ.1246లో స్విట్జర్లాండ్‌కు చెందిన ఆస్లేషియన్ కుటుంబం (హాప్స్‌బర్గ్) ఆక్రమించి పాలన కొనసాగించింది. హాప్స్‌బర్గ్ కుటుంబం సుమారు 800 సం.లు పాలించింది. నెపోలియన్‌తో ఓటమి ఆస్ట్రియా ఫ్రాన్స్ అధీనంలోకి వెళ్ళింది. 1815లో వియన్నా కాంగ్రెస్ సదస్సు జరిగింది. తర్వాత జర్మన్ సామ్రాజ్యంలో కొంతకాలం ఉండి యుద్ధం వల్ల బయటపడింది. మొదటి ప్రపంచయుద్ధం ప్రారంభంలో ఆస్ట్రియా-హంగేరీ సామ్రాజ్యం బోస్నియా హెర్జ్‌గొనియాను ఆక్రమించుటకు ప్రయత్నించింది. సెరాజివో యువరాజు హత్యతో ప్రపంచయుద్ధం ఆరంభమైంది. సుమారు 10లక్షల ఆస్ట్రియా-హంగేరీ సైనికులు ఈ యుద్ధంలో మరణించారు. రెండో ప్రపంచయుద్ధానికి ముందే ఆస్ట్రియాను థర్డ్ రీచ్‌ ఆక్రమించింది. నాజీలు ఆస్ట్రియాను ఆస్ట్‌మార్క్‌గా పేరుపెట్టారు. రెండోప్రపంచ యుద్ధం అనంతరం వియన్నా రష్యా నేతృత్వంలోని కమ్యూనిస్టు కూటమిలో చేరింది. 1995లో ఈ దేశం ఐరోపా కూటమిలో భాగమైంది.

క్రీడలు:

ఆస్ట్రియా పత్వరప్రాంత దేశమైనందున మైదాన క్రీడలు అభివృద్ధి చెందలేవు. స్నోబోర్డింగ్, స్కైజంపింగ్ లాంటి క్రీడలు జనాదరణ పొందాయి. 1964, 1976లలో ఆస్ట్రియా శీతాకాలపు ఒలింపిక్ క్రీడలను నిర్వహించింది.


Home
విభాగాలు: ప్రపంచ దేశాలు


 = = = = =


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక