జుక్కల్ కామారెడ్డి జిల్లాకు చెందిన మండలము. ఇది జిల్లాలో అతి పశ్చిమాన ఉన్న మండలము. మండలంలోని గ్రామాలన్నీ పూర్వపు మద్నూర్ తాలుకాలోని గ్రామాలు. మండలంలో 14 ఎంపీటీసి స్థానాలు, 31 రెవెన్యూ గ్రామాలు కలవు. ఈ మండలం బాన్సువాడ రెవెన్యూ డివిజన్, జుక్కల్ అసెంబ్లీ నియోజకవర్గం, జహీరాబాదు లోక్‌సభ నియోజకవర్గంలో భాగంగా ఉంది. కౌలాస్ నాలా ప్రాజెక్టు ఈ మండలంలో ఉంది. ఈ మండలానికి చెందిన హన్మంత్ షిండే 2 సార్లు జుక్కల్ నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు.
2016 జిల్లాల పునర్వ్యవస్థీకరణ సమయంలో జుక్కల్ మండలంలోని 3 గ్రామాలను విడదీసి కొత్తగా ఏర్పాటుచేసిన పెద్దకోడప్‌గల్ మండలంలో కలిపారు. అదేసమయంలో ఈ మండలం నిజామాబాదు జిల్లా నుంచి కొత్తగా ఏర్పడిన కామారెడ్డి జిల్లాలో చేరింది. భౌగోళికం, సరిహద్దులు: జుక్కల్ మండలం కామారెడ్డీ జిల్లాలో పశ్చిమాన మహారాష్ట్ర సరిహద్దులో ఉంది. ఈ మండలానికి ఉత్తరాన మద్నూరు మండలం, తూర్పున బిచ్కుంద మండలం, ఆగ్నేయాన పాతకోడప్‌గల్ మండలం, దక్షిణాన మరియు పశ్చిమాన మహారాష్ట్ర సరిహద్దులుగా ఉన్నాయి. జనాభా: 2011 లెక్కల ప్రకారం మండల జనాభా 53565. ఇందులో పురుషులు 27418, మహిళలు 26147. స్త్రీపురుష నిష్పత్తిలో (954/వెయ్యి పురుషులకు) ఈ మండలం జిల్లాలో చివరి స్థానంలో ఉంది. అక్షరాస్యత శాతం 51.00%. రాజకీయాలు: ఈ మండలము జుక్కల్ అసెంబ్లీ నియోజకవర్గం, జహీరాబాదు లోకసభ నియోజకవర్గంలో భాగముగా ఉంది. 2019 ప్రకారం మండలంలో 14 ఎంపీటీసి స్థానాలు కలవు. ఈ మండలానికి చెందిన హన్మంత్ షిండే 2 సార్లు జుక్కల్ నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. మండలంలోని రెవెన్యూ గ్రామాలు: Bangarpalle, Baswapur, Bijjalwadi, Chandegaon, Chinna Edgi, Chinna Ghulla, Dongaon, Dostpalle, Gundoor, Hangarga, Jukkal, Kanthali, Kathalwadi, Khanapur, Khandeballoor, Khemraja Kallali, Kowlas, Ladegaon, Longaon, Madhapur, Mailar, Mohammadabad, Nagalgaon, Padampalle, Pedda Edgi, Pedda Ghulla, Rudrapahad, Savargaon, Siddapur, Sopur, Wajrakhandi
ప్రముఖ గ్రామాలు / పట్టణాలు
..:... ఇవి కూడా చూడండి:
= = = = =
సంప్రదించిన పుస్తకాలు, వెబ్‌సైట్లు:
|
About Jukkal Mandal Kamareddy Dist (district) Mandal in telugu, Kamareddy Dist Mandals in telugu,
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి