24, మే 2019, శుక్రవారం

బండి సంజయ్ కుమార్ (Bandi Sanjay Kumar)

 బండి సంజయ్ కుమార్
జననంజూలై 11, 1971
పదవులుకరీంనగర్ ఎంపి, తెలంగాణ భాజపా అధ్యక్షుడు
కరీంనగర్ జిల్లాకు చెందిన రాజకీయ నాయకుడైన బండి సంజయ్ కుమార్ జూలై 11, 1971న జన్మించారు. విద్యార్థి దశ నుంచే ఆరెస్సెస్ కార్యక్రమాలలో పాల్గొన్నారు. ఏబివిపి పట్టణ కన్వీనర్‌గా, ఉపాధ్యక్షుడిగా, రాష్ట్ర కార్యవర్గ సభ్యునిగా సేవలందించారు. 2 పర్యాయాలు కరీంనగర్ సహకార పట్టణ బ్యాంకు డైరెక్టరుగా వ్యవహరించారు. భాజపా కరీంనగర్ నగర అధ్యక్షుడిగా కూడా రెండు సార్లు పనిచేశారు. కరీంనగర్ నగరపాలక సంస్థ కార్పోరేటర్‌గా 3 సార్లు ఎన్నికయ్యారు. 3 సార్లు కూడా 48వ డివిజన్ నుంచే విజయం సాధించారు.

2014 మరియు 2019లలో కరీంనగర్ నియోజకవర్గం నుంచి భాజపా తరఫున శాసనసభకు పోటీచేసి రెండోస్థానంలో నిలిచారు. 2019 లోక్‌సభ ఎన్నికలలో కరీంనగర్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి భాజపా తరఫున పోటీచేసి తెరాసకు చెందిన సిటింగ్ ఎంపి విబోద్ కుమార్‌పై సంచలన విజయం సాధించి తొలిసారి లోక్‌సభలో అడుగుపెట్టారు. 2020 మార్చిలో తెలంగాణ భాజపా అధ్యక్షులుగా బాధ్యతలు కూడా చేపట్టారు. ప్రస్తుతం తెలంగాణలో భాజపా ప్రధాన వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నారు.

ఇవి కూడా చూడండి:

విభాగాలు: తెలంగాణ భాజపా ప్రముఖులు, 17వ లోక్‌సభ సభ్యులు, కరీంనగర్ జిల్లా ప్రముఖులు, తెలంగాణ రాజకీయ నాయకులు, భారతీయ జనతాపార్టీ ప్రముఖులు,


 = = = = =


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక