భారతదేశ సరిహద్దు దేశాలలో ఒకటైన భూటాన్ తూర్పు హిమాలయ పర్వత ప్రాంతంలో ఉంది. నలువైపులా భూభాగంచే ఆవరించబడినయున్న ఈ దేశం దక్షిణాసియాలో భాగము. దేశరాజధాని మరియు అతిపెద్ద నగరం థింపూ. దేశంలో బౌద్ధమతం ప్రాబల్యంలో ఉంది. 2008లో భూటాన్ రాజరికం నుంచి ప్రజాస్వామ్యదేశంగా మారింది (దేశాధినేత మాత్రం రాజునే). ఐక్యరాజ్యసమితి, సార్క్, అలీనదేశాల కూటమిలలో ఈ దేశ సభ్యదేశంగా ఉంది. దేశ వైశాల్యం 38,394 చకిమీ, జనాభా 7.2 లక్షలు. కరెన్సీ పేరు గుల్‌ట్రమ్. భూటానీయులు తమదేశాన్ని డ్రుక్‌యుల్‌గా పిలుస్తారు. ఈ దేశం పిడుగుల దేశంగా ప్రసిద్ధి చెందింది.
భౌగోళికం, సరిహద్దులు: ఈ దేశానికి ఉత్తరాన టిబెట్టు సరిహద్దుగా ఉండగా మిగితావైపుల భారతదేశం సరిహద్దుగా ఉంది. పశ్చిమాన సిక్కిం, తూర్పున అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, దక్షిణాన పశ్చిమబెంగాల్ రాష్ట్రాలు సరిహద్దులుగా ఉన్నాయి. ఈ దేశం దక్షిణాసియాలో భాగము. 7000+ మీ ఎత్తయిన గాంక్‌ఘర్ ప్యూన్‌సమ్ దేశంలోని ఎత్తయిన పర్వత శిఖరం. ప్రపంచంలో ఇప్పటివరకు మానవుడు అధిరోహించని ఎత్తయిన పర్వతశిఖరం-గాంక్‌ఘర్ ప్యూన్‌సమ్ (7000+ మీ) భూటాన్. చరిత్ర: భూటాన్‌కు వేల సంవత్సరాల చరిత్ర ఉన్ననూ ఆధారాలు లభ్యం కాలేవు. 19వ శతాబ్దిలో జరిగిన ఒక అగ్నిప్రమాదంలో ఉన్న ఆధారాలు కూడా కాలి బూడిదగా మారాయి. ఆధునికకాలంలో 1774లో భూటాన్ ఈస్టిండియా కంపెనీతో ఒప్పందం కుదుర్చుకుంది. 1910లో బ్రిటన్‌తో ఒప్పందం భూటాన్ చరిత్రను మార్చివేసింది. ఆర్థికం: భూటాన్ పర్వతప్రాంతంలో ఉండుటచే ఆర్థికంగా అభివృద్ధి చెందలేదు. ఇది అభివృద్ధి చెందని దేశంగా పరిగణించడం జరుగుతోంది. వ్యవసాయం ఇక్కడి ప్రజల ప్రధాన జీవనాధారం. దేశ ఎగుమతులలో ప్రధానమైనది జలవిద్యుచ్ఛక్తి. క్రీడలు: భూటాన్ జాతీయ క్రీడ మరియు ప్రజాదరణ పొందిన క్రీడ ఆర్చెరి. ఇటీవలి కాలంలో క్రికెట్ ప్రజాదరణ పొందుతోంది. ఇవి కూడా చూడండి:
= = = = =
|
6, మే 2019, సోమవారం
భూటాన్ (Bhutan)
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
Index
తెలుగులో విజ్ఞానసర్వస్వము
|
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు, సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, వార్తలు, సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు, |
విభాగాలు: |
------------
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి