దుబ్బాక సిద్ధిపేట జిల్లాకు చెందిన మండలము. ఈ మండలం జిల్లా వాయువ్యంలో మెదక్, రాజన్న సిరిసిల్ల మరియు కామారెడ్డి జిల్లాలో సరిహద్దులో ఉంది. మండలంలో 13 ఎంపీటీసి స్థానాలు, xx గ్రామపంచాయతీలు, 20 రెవెన్యూ గ్రామాలు కలవు. ఈ మండలం సిద్ధిపేట రెవెన్యూ డివిజన్, దుబ్బాక అసెంబ్లీ నియోజకవర్గం, మెదక్ లోకసభ నియోజకవర్గంలో భాగంగా ఉన్నది. రామేశ్వరంపల్లి గ్రామ శివారులోని కూడవెల్లి రామలింగేశ్వరస్వామి ఆలయ ఉంది.
భౌగోళికం, సరిహద్దులు: దుబ్బాక మండలం సిద్ధిపేట జిల్లా వాయువ్యంలో మెదక్, రాజన్న సిరిసిల్ల మరియు కామారెడ్డి జిల్లాలో సరిహద్దులో ఉంది. ఈ మండలానికి తూర్పున సిద్ధిపేట గ్రామీణ మండలం, దక్షిణాన మీర్‌దొడ్డి మండలం, ఉత్తరాన రాజన్న సిరిసిల్ల జిల్లా, పశ్చిమాన కామారెడ్డి జిల్లా మరియు మెదక్ జిల్లాలు సరిహద్దులుగా ఉన్నాయి. జనాభా: 2011 లెక్కల ప్రకారం మండల జనాభా 71853. ఇందులో పురుషులు 35344, మహిళలు 36509. అక్షరాస్యుల సంఖ్య 39977. రాజకీయాలు: ఈ మండలం దుబ్బాక అసెంబ్లీ నియోజకవర్గం, మెదక్ లోకసభ నియోజకవర్గంలో భాగంగా ఉన్నది. 2009లో దుబ్బాక పేరుతో అసెంబ్లీ నియోజకవర్గం ఏర్పడింది. మండలంలో 2019 ప్రకారం 13 ఎంపీటీసి స్థానాలు కలవు. చిట్టాపూర్‌కు చెందిన సోలిపేట రాంచంద్రారెడ్డి 1972, 2004, 2014లో ఎమ్మెల్యేగా గెలుపొందారు. మండలంలోని రెవెన్యూ గ్రామాలు:
ప్రముఖ గ్రామాలు / పట్టణాలు
చిట్టాపూర్ (Chittapur):చిట్టాపూర్ సిద్ధిపేట జిల్లా దుబ్బాక మండలమునకు చెందిన గ్రామము. ఈ గ్రామానికి చెందిన సోలిపేట రామలింగారెడ్డి దుబ్బాక నుంచి 4 సార్లు శాసనసభకు ఎన్నికైనారు. ఈయన ఆగస్టు 6, 2020న మరణించారు.. ఇవి కూడా చూడండి:
= = = = =
సంప్రదించిన పుస్తకాలు, వెబ్‌సైట్లు:
|
About Dubbaka Mandal Siddhipet Dist (district) Mandal in telugu, Siddhipet Dist Mandals in telugu,
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి