రామచంద్రాపురం సంగారెడ్డి జిల్లాకు చెందిన మండలము. సంగారెడ్డి జిల్లాలో ఇది అతి దక్షిణాన ఉన్న మండలం. గ్రేటర్ హైదరాబాదులో ఈ మండలంలోని పట్టణ ప్రాంతం భాగంగా ఉన్నది. పూనే-విజయవాడ 9వ నెంబరు జాతీయ రహదారి, హైదరాబాదు - వాడి రైలుమార్గం మండలం గుండా వెళ్ళుచున్నది. మండలంలో 9 రెవెన్యూ గ్రామాలు కలవు.
తెల్లాపూర్ గ్రామంలో 15వ శతాబ్దికి చెందిన తెలంగాణపురం శాసనం లభించింది. తెలంగాణకు ఆ పేరు రావడానికి ఈ శాసనమే కారణమనే అభిప్రాయం కూడా చరిత్రకారులలో ఉంది. ఇప్పటివరకు "తెలంగాణ" పదం కనిపించిన ఆధారాలలో ఇదే పురాతనమైనది. భౌగోళికం, సరిహద్దులు: రామచంద్రాపురం మండలం సంగారెడ్డీ జిల్లాలో దక్షిణం వైపున రంగారెడ్డీ జిల్లా సరిహద్దులో ఉంది. ఈ మండలానికి ఉత్తరాన పటాన్‌చెరు మండలం, ఈశాన్యాన అమీన్‌పూర్ మండలం, మిగితావైపులా రంగారెడ్డి జిల్లా సరిహద్దుగా ఉంది. జనాభా: 2011 లెక్కల ప్రకారం మండల జనాభా 117648. ఇందులో పురుషులు 60567, మహిళలు 57081. అక్షరాస్యుల సంఖ్య 86005. పట్టణ జనాభా 107741, గ్రామీణ జనాభా 9907. స్త్రీపురుష నిష్పత్తిలో (942/వెయ్యి పురుషులకు) ఇది జిల్లాలో అత్యధిక అక్షరాస్యత శాతం కల మండలాలలో ప్రథమ స్థానంలో ఉంది. రాజకీయాలు: ఈ మండలం పటాన్‌చెరు అసెంబ్లీ నియోజకవర్గం, మెదక్ లోకసభ నియోజకవర్గంలో భాగంగా ఉన్నది. ఈ మండలం గ్రేటర్ హైదరాబాదులో భాగము. 2013లో తెల్లాపూర్ సర్పించిగా ఎన్నికైన సోమిరెడ్డి తెలంగాణ రాష్ట్ర సర్పించిన సంఘం అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. మండలంలోని రెవెన్యూ గ్రామాలు: Bandalguda, Edulnagulapally, Kachireddipally, Kollur, Manmole (DP), Osman Nagar, Ramachandrapuram, Tellapur, Velmala
ప్రముఖ గ్రామాలు / పట్టణాలు
నాగులపల్లి (Nagulapalli):నాగులపల్లి సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం మండలమునకు చెందిన గ్రామము. హైదరాబాదు-వాడి రైలుమార్గంపై నాగులపల్లి వద్ద రైల్వేస్టేషన్ ఉంది. ఇక్కడ రైల్వే టర్మినల్ నిర్మించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. తెల్లాపూర్ (Tellapur): తెల్లాపూర్ సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం మండలమునకు చెందిన గ్రామము. గ్రామంలో ప్రాచీన శిలాశాసనం లభించింది. ఇది తెల్లాపూర్ శాసనంగా, తెలంగాణపురం శాసనంగా ప్రసిద్ధి చెందింది. తెలంగాణకు ఆ పేరు రావడానికి ఈ శాసనమే కారణం అనే అభిప్రాయం కూడా చరిత్రకారులలో ఉంది. 2013 జూలైలో పంచాయతి సర్పంచిగా ఎన్నికైన మల్లేపల్లి సోమిరెడ్డి తెలంగాణ రాష్ట్ర సర్పంచిల సంఘం అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఇవి కూడా చూడండి:
= = = = =
సంప్రదించిన పుస్తకాలు, వెబ్‌సైట్లు:
|
About Ramachandrapuram Mandal Sangareddy Dist (district) Mandal in telugu, Sanga Reddy Dist Mandals in telugu,
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి