టెలివిజన్ నటిగా, రాజకీయ నాయకురాలిగా పేరుపొందిన స్మృతి ఇరానీ మార్చి 23, 1976న కొత్తఢిల్లీలో జన్మించారు. ఈమె అసలుపేరు స్మృతి మల్హోత్రా. భారతీయ జనతా పార్టీకి చెందిన స్మృతీరానీ 2014 నుంచి నరేంద్రమోడి మంత్రివర్గంలో కొనసాగుతున్నారు. 2019 లోక్‌సభ ఎన్నికలలో అమేథీ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు, ప్రధానమంత్రి అభ్యర్థి అయిన రాహుల్ గాంధీని ఓడించి సంచలనం సృష్టించారు.
ప్రారంభ జీవితం: పేదకుటుంబంలో జన్మించిన స్మృతి ఇరానీ ప్రారంభంలో వెయిట్రన్‌గా, సేల్స్‌గర్ల్‌గా పనిచేసింది. ఆకర్షణీయ రూపంతో 1998లో మిస్ ఇండియా పోటీలలో కూడా పాల్గొంది. దీనితో టెలివిజన్ నటిగా అవకాశాలు వచ్చాయి. ఏక్తాకపూర్ నిర్మించిన "క్యోంకీ సాస్ భీ కబీ బహూ థీ" సీరియల్ నటనతో పేరు రావడమే కాకుండా పాత అప్పులను కూడా తీర్చింది. జుబిద్ ఇరానీని వివాహం చేసుకుంది. రాజకీయ ప్రస్థానం: స్మృతి ఇరానీ 2003లో రాజకీయాలలో ప్రవేశించారు. స్మృతి తల్లి జనసంఘ్ సభ్యురాలు కాగా తాత ఆర్.ఎస్.ఎస్.లో పనిచేశారు. దీనితో భారతీయ జనతా పార్టీలో చేరారు. 2004లో మహారాష్ట్ర యువ విభాగం ఉపాధ్యక్షపదవి పొందారు. 2004 లోక్‌సభ ఎన్నికలలో ఢిలీలోని చాంద్‌నీచౌక్ నియోజకరవర్గంలో కపిల్ సిబాల్ పై పోటీచేశారు. తర్వాత భాజపా కేంద్ర కార్యనిర్వాహక కమిటికి నామినేట్ అయ్యారు. 2004లోనే నరేంద్రమోడిని విమర్శించి మోడికి వ్యతిరేకంగా ఆమరణదీక్ష చేయుటకు ప్రయత్నించారు. 2009లో విజయ్ గోయెల్‌పై పోటీచేశారు. 2010లో భాజపా జాతీయ కార్యదర్శి హోదాను, ఆ వెంటనే భజాపా ,అహిళా విభాగమైన బిజెపి మహిళామోర్చా అధ్యక్షహోదాను పొందారు. 2011లో గుజరాత్ నుంచి రాజ్యసభకు ఎన్నికయ్యారు. 2014లో ఇరానీ అమేథీలో రాహుల్ గాంధీపై పోటీచేశారు. రాహుల్ గాంధీ చేతిలో ఓడిననూ మెజారిటీ మాత్రం లక్షకు తగ్గించగలిగారు. 2014 నరేంద్రమోడి మంత్రివర్గంలో మానవ వనరుల శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఆమె విద్యార్థత విషయంలో వచ్చిన ఫిర్యాదుల వల్ల జౌళిశాఖకు మార్పు అయ్యారు. 2019 లోక్‌సభ ఎన్నికలలో మరోసారి అమేథీలో పోటీచేసి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మరియు ప్రధానమంత్రి అభ్యర్థి అయిన రాహుల్ గాంధీపై సంచలన విజయం సాధించారు. ఇవి కూడా చూడండి:
= = = = =
|
25, మే 2019, శనివారం
స్మృతి ఇరానీ (Smriti Irani)
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
Index
తెలుగులో విజ్ఞానసర్వస్వము
|
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు, సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, వార్తలు, సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు, |
విభాగాలు: |
------------
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి