16, జూన్ 2019, ఆదివారం

హరీష్ చంద్ర హెడా (Harish Chandra Heda)

హరీష్ చంద్ర హెడా
జననంఅక్టోబరు 14, 1912
రంగంవిమోచనోద్యమ నాయకుడు
పదవులు3 సార్లు ఎంపి,
నియోజకవర్గంనిజామాబాదు
మరణంఆగస్టు 28, 2002
స్వాతంత్ర్య సమరయోధుడిగా (హైదరాబాదు విమోచనోద్యమ నాయకుడిగా), గాంధేయవాదిగా, రాజకీయ నాయకుడిగా పేరుపొందిన హరీష్ చంద్ర హెడా మహారాష్ట్రలోని ఉస్మానాబాదు జిల్లా శిరధోన్‌లో (అప్పటి హైదరాబాదు రాజ్యం) అక్టోబరు 14, 1912న జన్మించారు. భారత జాతీయ కాంగ్రెసు పార్టీకి చెందిన హెచ్.సి.హెడా మూడు పర్యాయాలు నిజామాబాదు నియోజకవర్గం నుండి లోక్‍సభకు ఎన్నికై 1952 నుండి 1967 వరకు ప్రాతినిధ్యం వహించారు.

న్యాయవాద పట్టా పొందిన హెడా ప్రారంభంలో న్యాయవాదిగా ప్రాక్టీసు చేశాడు. 1938లో హైదరాబాదు రాష్ట్ర కాంగ్రేసు మరియు ఆర్య సమాజం ఏర్పాటు చేసిన సత్యాగ్రహంలో పాల్గొన్నారు. క్విట్ ఇండియా ఉద్యమకాలంలోనూ హైదరాబాదు విమోచనోద్యమంలోనూ పాల్గొని జైలుకెళ్ళారు. జవహర్‌లాల్ నెహ్రూ, సర్దార్ వల్లభాయి పటేల్ల సన్నిహిత సహచరుడైన హెడా 1949లో తాత్కాలిక పార్లమెంటుకు, ఆ తర్వాత భారత రాజ్యాంగాన్ని తయారు చేయడానికి ఏర్పడిన రాజ్యాంగసభకు ఎన్నికైనారు. 1952లో జరిగిన తొలి సార్వత్రిక ఎన్నికలలో నిజామాబాదు లోక్‍సభ నియోజకవర్గం నుండి సోషలిస్టు అభ్యర్థి అయిన కాశీనాథరావు ముకాల్పర్‌ను ఓడించారు. ఆ తరువాత 1957లోనూ, 1962లోనూ స్థానిక అభ్యుర్ధులైన జి.రాజారాం మరియు ఎం.నారాయణ రెడ్డిలను ఓడించి తిరిగి లోక్‍సభకు ఎన్నికయ్యారు. అయితే 1967 ఎన్నికలలో ఎం.నారాయణ రెడ్డి చేతిలో ఓడిపోయారు.

హెడా మార్క్సిజం, గాంధేయవాదంపై అనేక వ్యాసాలు వ్రాశారు. గాంధీజీస్ నౌఖాలీ పద్ యాత్ర (1946), ఆన్ ద హైసీస్ (1958) మరియు ఎన్నికలు ఇన్ బ్రిటన్ (1960) అనే మూడు పుస్తకాలను ప్రచురించారు.

ఈయన ఆగస్టు 28, 2002న తొంభై ఏళ్ల వయసులో హైదరాబాదులో మరణించారు. ఈయన సతీమణి గ్యాన్ కుమారీ హెడా కూడా ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధురాలు, సర్వోదయ ఉద్యమ నాయకురాలు, గాంధీ స్మృతి అధ్యక్షురాలు.

ఇవి కూడా చూడండి:

హోం
విభాగాలు: మహారాష్ట్ర ప్రముఖులు, హైదరాబాదు విమోచనోద్య నాయకులు,


 = = = = =
ఆధారాలు:

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక