నిజామాబాదు గ్రామీణ నిజామాబాదు జిల్లాకు చెందిన మండలము. మండలంలో 8 ఎంపీటీసి స్థానాలు, 19 గ్రామపంచాయతీలు, 19 రెవెన్యూ గ్రామాలు కలవు. సికింద్రాబాదు - ముద్ఖేడ్ రైలుమార్గం మరియు నిజామాబాదు - జగదల్‌పూర్ జాతీయ రహదారి మండలం మీదుగా వెళ్ళుచున్నాయి.
అక్టోబరు 11, 2016న ఈ మండలం కొత్తగా ఏర్పడింది. అదివరకు నిజామాబాదు మండలంలోని 19 గ్రామాలను విడదీసి ఈ మండలాన్ని ఏర్పాటుచేశారు. భౌగోళికం, సరిహద్దులు: భౌగోళికంగా ఈ మండలం తిరగేసిన యు (U) ఆకారంలో ఉంది. నిజామాబాదు ఉత్తర మండలం మరియు నిజామాబాదు దక్షిణ మండలం ఈ రెండు మండలాలను గ్రామీణ మండలం మూడువైపులా చుట్టబడి ఉంది. ఈ మండలానికి ఉత్తరాన నవీపేట మండలం మరియు మాక్లూర్ మండలం, తూర్పున మాక్లూర్ మండలం, దక్షిణాన ముగ్పాల్ మండలం, నైరుతిన వర్ని మండలం, పశ్చిమాన ఎడపల్లి మండలం సరిహద్దులుగా ఉన్నాయి. జనాభా: 2011 లెక్కల ప్రకారం మండల జనాభా 411752. ఇందులో పురుషులు 205112, మహిళలు 206640. రాజకీయాలు: ఈ మండలం నిజామాబాదు పట్టణ అసెంబ్లీ నియోజకవర్గం, నిజామాబాదు లోక్‌సభ నియోజకవర్గంలో భాగంగా ఉంది. 2019 ప్రకారం మండలంలో 8 ఎంపీటీసి స్థానాలు కలవు. మండలంలోని రెవెన్యూ గ్రామాలు: Dharmaram(M), Goopanpally, Gundaram, Jalalpur, Kaloor, Keshapur, Khanapur, Kondur, Laxmapur, Malkapur(A), Malkapur(T), Mallaram, Mubharak Nagar, Muthakunta, Palda, Pangra, Sarangapoor, Seripur (deserted), Thirmanpally
ప్రముఖ గ్రామాలు
సారంగాపుర్ (Sarangapur): సారంగాపుర్ నిజామాబాదు జిల్లా నిజామాబాదు గ్రామీణ మండలమునకు చెందిన గ్రామము. నిజామాబాదు నుంచి 8 కిమీ దూరంలో ఉంది. ఇక్కడ పురాతనమన హనుమాన్ మందిరం ఉంది. ఛత్రపతి శివాజీ గురువు సమర్థ రామదాసుచే సుమారు 450 సం.ల క్రితం ఇది నిర్మితమైంది. .
= = = = =
సంప్రదించిన పుస్తకాలు, వెబ్‌సైట్లు:
|
Nizamabad Rural Mandal, Nizamabad Dist (district) Mandal in telugu, Nizamabad Dist Mandals in telugu,
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి