ముగ్పాల్ నిజామాబాదు జిల్లాకు చెందిన మండలము. మండలంలో 11 ఎంపీటీసి స్థానాలు, 21 గ్రామపంచాయతీలు, 15 రెవెన్యూ గ్రామాలు కలవు. సినీ నిర్మాత దిల్ రాజు ఈ మండలమునకు చెందినవారు.
అక్టోబరు 11, 2016న ఈ మండలం కొత్తగా ఏర్పడింది. అదివరకు నిజామాబాదు మండలంలో ఉన్న 15 గ్రామాలను విడదీసి ఈ మండలాన్ని ఏర్పాటు చేశారు. భౌగోళికం, సరిహద్దులు: ముగ్పాల్ మండలం నిజామాబాదు జిల్లాలో దక్షిణం వైపున కామారెడ్డి జిల్లా సరిహద్దులో ఉంది. ఈ మండలానికి తూర్పున డిచ్‌పల్లి మండలం, ఇందల్‌వాయి మండలం, పశ్చిమాన వర్ని మండలం, ఉత్తరాన నిజామాబాదు దక్షిణ మండలం, నిజామాబాదు గ్రామీణ మండలం సరిహద్దులుగా ఉన్నాయి. రాజకీయాలు: ఈ మండలం నిజామాబాదు పట్టణ అసెంబ్లీ నియోజకవర్గం, నిజామాబాదు లోక్‌సభ నియోజకవర్గంలో భాగంగా ఉంది. 2019 ప్రకారం మండలంలో 11 ఎంపీటీసి స్థానాలు కలవు. మండలంలోని రెవెన్యూ గ్రామాలు: Amrabad, Badsi, Bhairapur, Borgaon(P), Chinnapur, Kalpol, Kanjar, Kulaspoor, Manchippa, Mudakpally (Narsingpally), Mugpal, Nyalkal, Sirpur, Thanakurd, Yellammakunta
ప్రముఖ గ్రామాలు
నర్సింగ్‌పల్లి (Narsingpally): నర్సింగ్‌పల్లి నిజామాబాదు జిల్లా ముగ్పాల్ మండలమునకు చెందిన గ్రామము. సినీ నిర్మాత దిల్ రాజు స్వగ్రామం. దిల్ రాజు ప్రారంభించిన "మా పల్లె" ఛారిటేబుల్ ట్రస్ట్ ద్వారా గ్రామం అభివృద్ధి చెందింది.
= = = = =
సంప్రదించిన పుస్తకాలు, వెబ్‌సైట్లు:
|
Mugpal Mandal, Nizamabad Dist (district) Mandal in telugu, Nizamabad Dist Mandals in telugu,
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి