క్రీ.శ.15వ శతాబ్దికి చెందిన పిల్లలమర్రి పిన వీరభద్రుడు విద్వత్కవి. సరస్వతీ కటాక్షాన్ని పొందిన మహాకవి. "వాణి నారాణి' అని చెప్పినట్లు జనబాహుళ్యంలో ఉంది. పదిహేనో శతాబ్ధంలోని ఈ కవి "శృంగార శాకుంతలం", "జైమినీ భారతం" అనే గ్రంథాలు రచించాడు.
శృంగార శాకుంతలం: శృంగార శాకుంతలం నాలుగు ఆశ్వాసాల ప్రభంధం. దీన్ని వెన్నయామాత్యునికి అంకితం ఇచ్చాడు. ఈ కావ్యానికి పేరు పెట్టడంలో శ్రీనాథుని అనుకరించాడు. వ్యాస భారతంలోని మూలకథను గాని, కాళిదాసు అభిఙ్ఞాన శాకుంతలమును గాని యధాతధంగా అనుసరించక రెండింటిని కలిపి మృదు మధుర శృంగార రస ప్రభందంగా శృంగార శాకుంతలాన్ని రచించాడు. ఈ కావ్యంలో శృంగార రసపోషణకు ప్రాధాన్యం ఉంది. జైమిని భారతం: జైమిని భారతం పిల్లలమర్రి పినవీరభద్రుని రెండో కావ్యం. ఇది 8 ఆశ్వాసాల ప్రబందం. దీనిని సాళువ నరసింహరాయలకు అంకితం ఇచ్చాడు. జైమినీ భారత రచనా నైపుణ్యాన్ని నరసింహరాయలు మెచ్చుకొన్నట్లు జైమిని భారత పీఠికలో కవి చెప్పుకొన్నాడు. భారతంలోని అశ్వమేధ పర్వ కథే జైమిని భారతంలోని ఇతివృత్తం. కురుక్షేత్ర యుద్ధం తరువాత ధర్మరాజు చేసిన అశ్వమేధ యాగాన్ని గురించి జైమిని అనే మహర్షి జనమేజయునికి చెప్పిన విషయం ఇందులో ముఖ్యమైంది. మహాభారతంలో లేని ఉపాఖ్యానాలు - కుశలవోపాఖ్యానం, చంద్రహాస చరిత్ర, ప్రమీలార్జునీయం, ఉద్దాలకుని చరిత్ర వంటివి జైమిని భారతంలో ఉన్నాయి. ఈ కావ్యంలో ప్రారంభంలో శైలి ఫ్రౌఢమైనది అయిన తరువాత రమ్య శైలిని కవి పాటించాడు. తెలుగు పలుకుబడులను ఈ కవి చక్కగా ప్రయోగించాడు. తరువాతి ప్రబంధ రీతికి శ్రీనాథుని వలెనే పిల్లల మర్రి పినవీరభద్రుడు కూడా మార్గదర్శకుడే.
= = = = =
ఆధారాలు:
|
5, జూన్ 2019, బుధవారం
పిల్లలమర్రి పినవీరభద్రుడు (Pillalamarri Pinaveerabhadrudu)
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
Index
తెలుగులో విజ్ఞానసర్వస్వము
|
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు, సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, వార్తలు, సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు, |
విభాగాలు: |
------------
Great poet.
రిప్లయితొలగించండి