దోమకొండ మండలం కామారెడ్డి జిల్లాకు చెందిన మండలము. మండలంలో 16 ఎంపీటీసి స్థానాలు, 10 గ్రామపంచాయతీలు, 21 రెవెన్యూ గ్రామాలు కలవు. మండల కేంద్రం దోమకొండ సంస్థానానికి ముఖ్యకేంద్రంగా పనిచేసింది. దోమకొండకు పశ్చిమాన ఉన్న కామారెడ్డి, భిక్నూరుల మీదుగా 44న నెంబరు జాతీయ రహదారి వెళ్ళుచున్నది.
2016 జిల్లాల పునర్వ్యవస్థీకరణ సమయంలో దోమకొండ మండలంలోని 10 గ్రామాలను విడదీసి కొత్తగా ఏర్పాటుచేసిన బీబీపేట మండలంలో కలిపారు. అదేసమయంలో ఈ మండలం నిజామాబాదు జిల్లా నుంచి కొత్తగా ఏర్పడిన కామారెడ్డి జిల్లాలో చేరింది. భౌగోళికం, సరిహద్దులు: ఈ మండలానికి ఉత్తరాన మాచారెడ్డి మండలం, ఆగ్నేయాన బీబీపేట మండలం, దక్షిణాన మరియు పశ్చిమాన భిక్నూరు మండలం, వాయువ్యాన కామారెడ్డి మండలం సరిహద్దులుగా ఉన్నాయి. తూర్పున రాజన్న సిరిసిల్ల జిల్లా సరిహద్దుగా ఉంది. జనాభా: 2011 లెక్కల ప్రకారం మండల జనాభా 56903. ఇందులో పురుషులు 27990, మహిళలు 28913. రాజకీయాలు: ఈ మండలము కామారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గం, జహీరాబాదు లోకసభ నియోజకవర్గంలో భాగముగా ఉన్నది. 2019 ప్రకారం మండలంలో 8 ఎంపీటీసి స్థానాలు కలవు. 2014లో ఎంపీపీగా బాల్ రాజవ్వ ఎన్నికయ్యారు. 2019 జడ్పీటీసి ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి చెందిన తీగల తిర్మల్ గౌడ్ ఎన్నికయ్యారు. మండలంలోని రెవెన్యూ గ్రామాలు: Ambarpet, Anchanur, Chintamanpalle, Domakonda, Kundaram, Lingupalle, Mutyampet, Sangameshwar, Siribibipet, Sitarampalle, Sitarampur
ప్రముఖ గ్రామాలు / పట్టణాలు
అంబారీపేట (Ambaripet):అంబారీపేట నిజామాబాదు జిల్లా దోమకొండ మండలమునకు చెందిన గ్రామము. ఈ గ్రామానికి చెందిన ప్రణయ జీవన్ రెడ్డి సుప్రీకోర్టు జడ్జిగా, లా కమీషన్ చైర్మెన్‌గా పనిచేశారు. దోమకొండ (Domakonda): దోమకొండ నిజామాబాదు జిల్లాకు చెందిన గ్రామము మరియు మండల కేంద్రము. దోమకొండ సంస్థానానికి ముఖ్యకేంద్రము. దోమకొండ కామారెడ్డి నుంచి 16 కిమీ దూరంలో ఉంది. దోమకొండ కుతుబ్‌షాహీలు, ఆసఫ్ జాహీల కాలంలో సంస్థానంగా ఉండింది. మండల వ్యవస్థకు పూర్వం ఇది తాలుకా కేంద్రంగా ఉండేది. దోమకొండలో రాష్ట్రకూటులు నిర్మించిన మహాదేవుని ఆలయం ఉంది. ఇవి కూడా చూడండి:
= = = = =
సంప్రదించిన పుస్తకాలు, వెబ్‌సైట్లు:
|
About Domakonda Mandal Mandal Kamareddy Dist (district) Mandal in telugu, Kamareddy Dist Mandals in telugu,
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి