3, అక్టోబర్ 2014, శుక్రవారం

చిత్తూరు జిల్లా (Chittoor Dist)

చిత్తూరు జిల్లా
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
వైశాల్యం15,359 చకిమీ
జనాభా41,70,468 (2011)
మండలాలు66
చిత్తూరు జిల్లా ఆంధ్రప్రదేశ్‌లోని 13 జిల్లాలలో ఒకటి. ఇది రాష్ట్రంలో అతి దక్షిణాన తమిళనాడు మరియు కర్ణాటక రాష్ట్రాల సరిహద్దులో ఉన్నది. ప్రముఖ అధ్యాత్మిక క్షేత్రాలు  తిరుమల, కాణిపాకం, శ్రీకాళహస్తి ఈ జిల్లాలోనివే. ప్రముఖ తత్వవేత్త జిడ్డు కృష్ణమూర్తి, ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, ముఖ్యమంత్రిగా పనిచేసిన నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ఈ జిల్లాకు చెందిన ప్రముఖులు. పాపాఘ్ని, బహుదా తదితర నదులు జిల్లా గుండా ప్రవహిస్తున్నాయి. ఈ జిల్లాలో 66 మండలాలు, 2 లోకసభ నియోజకవర్గాలు, 14 అసెంబ్లీ నియోజకవర్గాలు కలవు. జిల్లా వైశాల్యం 15,359 చకిమీ మరియు 2011 లెక్కల ప్రకారం జిల్లా జనాభా 41,70,468. బెంగుళూరు నుంచి చెన్నై వెళ్ళు జాతీయ రహదారి జిల్లా గుండా వెళ్ళుచున్నాయి. రేణిగుంట, పాకాల ప్రముఖ రైల్వేజంక్షన్లు.

భౌగోళికం, సరిహద్దులు:
చిత్తూరు జిల్లా 12°37′ - 14°8′ ఉత్తర అక్షాంశం మరియు 78°3′ - 79°55′ తూర్పు రేఖాంశం మధ్యలో ఉంది. ఈ జిల్లాకు దక్షిణాన తమిళనాడు రాష్ట్రం, పశ్చిమాన కర్ణాటక రాష్ట్రం, ఉత్తరాన కడప జిల్లా, నైరుతిన అనంతపురం జిల్లా, ఈశాన్యాన నెల్లూరు జిల్లా సరిహద్దులుగా ఉన్నాయి. జిల్లా వైశాల్యం 15,359 చదరపు కిలోమీటర్లు. జిల్లాలో 66 రెవెన్యూ మండలాలు కలవు.

చరిత్ర:
చిత్తూరు జిల్లా ఏప్రిల్ 1, 1911న ఏర్పడింది. అప్పటి ఉత్తర ఆర్కాట్ లో తెలుగు మాట్లాడే కొన్ని తాలూకాలు, కడప జిల్లా నుంచి కొన్ని తాలూకాలు, నెల్లూరు జిల్లా నుంచి మరికొన్ని తాలూకాలు కలిపి దీన్ని ఏర్పాటు చేశారు. దక్షిణ భారతదేశాన్ని పరిపాలించిన చోళులు, పల్లవులు, పాండ్యుల కాలంలో ఈ జిల్లా ప్రాంతం భాగంగా ఉండేది. విజయనగర సామ్రాజ్యం కాలంలో చంద్రగిరి కొన్నాళ్ళు రాజధానిగా కూడా విలసిల్లింది.

చంద్రబాబునాయుడు
జిల్లా ప్రముఖులు:
ప్రముఖ తత్వవేత్త జిడ్డు కృష్ణమూర్తి, ముఖ్యమంత్రులుగా పనిచేసిన నారా చంద్రబాబునాయుడు, నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి, భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షులుగా పనిచేసిన పి.ఆనందాచార్యులు, ప్రముఖ విద్యావేత్త, పండితుడు, కవి, సీఆర్ రెడ్డి 18 వ శతాబ్దానికి చెందిన ప్రముఖ కవయిత్రి తరిగొండ వెంగమాంబ, మా తెలుగు తల్లికి గేయం రచించిన శంకరంబాడి సుందరాచారి, లోకసభ స్పీకరుగా, బీహార్ గవర్నరుగా పనిచేసిన మాడభూషి అనంతశయనం అయ్యంగార్, స్వాతంత్ర్య సమరయోధులు పార్థసారథి అయ్యంగార్, పాపన్న గుప్తా ఈ జిల్లాకు చెందిన ప్రముఖులు.

తిరుమల ఆలయం
పర్యాటక ప్రదేశములు:
తిరుపతి. కాణిపాకం, శ్రీకాళహస్తి లాంటి అధ్యాత్మిక క్షేత్రాలతో పాటు చరిత్ర ప్రసిద్ధి చెందిన చెందిన చంద్రగిరి కోట, గుర్రంకొండలు, వేసవి విడిది కేంద్రం హర్స్‌లీహిల్స్ ఈ జిల్లాకు చెందిన ప్రముఖ పర్యాటక ప్రాంతాలు. 




ఇవి కూడా చూడండి:

హోం,
విభాగాలు: చిత్తూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జిల్లా వ్యాసాలు,


 = = = = =


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక