ప్రముఖ భారత స్వాతంత్ర్య సమరయోధుడు, విప్లవయోధుడు భగత్ సింగ్ 1907లో ప్రస్తుత పాకిస్తాన్‌లోని పంజాబ్ రాష్ట్ర బంగలో జన్మించాడు. భగత్ సింగ్ హిందుస్తాన్ సోషలిస్టు రిపబ్లికన్ పార్టీ స్థాపక సభ్యులలో ఒకడు. స్వాతంత్ర్య సమరంలో బ్రిటీష్ వారికి వ్యతిరేకంగా విప్లవభావాలతో ఉద్యమించాడు. ఇంక్విలాబ్ జిందాబాద్ (విప్లవం వర్థిల్లాలి) అనేది ఈయన నినాదం జాతీయోద్యమంలో ప్రసిద్ధి చెందింది. రాజకీయ ఖైదీలకు సమాన హక్కులు కల్పించాలని డిమాండ్ చేస్తూ జైలులో 64 రోజుల నిరాహారదీక్షను చేపట్టాడు. 1929లో బటుకేశ్వర్ దత్‌తో కల్సి పార్లమెంటుపై బాంబులు విసిరారు. 1928లో శివరాం, రాజ్‌గురులతో కలిసి భగత్ సింగ్ లాహోర్‌లో బ్రిటీష్ పోలీస్ అధికారి జాన్ సాండర్స్‌ను హతమార్చదల్చి పొరపాటున జేమ్స్ స్కాట్‌ను హతమార్చారు. లాలాలజపతిరాయ్ పై లాఠీచార్జీ చేసిన సాండర్స్‌ను హతమార్చడం వీరి ఉద్దేశ్యం. ఇదే కేసులో అరెస్ట్ అయి కేవలం 23 సం.ల వయస్సులోనే మార్చి 23, 1931న ఉరిశిక్షకు గురైనాడు.
1954లో తొలిసారిగా భగత్ సింగ్ జీవితంపై షహీద్-ఎ-ఆజాద్ భగత్ సింగ్ పేరిట సినిమా నిర్మించబడింది. స్వాతంత్ర్యోద్యమంలో ఈయన సేవలను గుర్తించిన భారత ప్రభుత్వం 1968లో భగత్ సింగ్ ముఖచిత్రంతో తపాలాబిళ్ల విడుదల చేసింది. 2006లో విడుదలయిన రంగ్ దే బసంతి చిత్రం భగత్ సింగ్ సమకాలీన విప్లవకారులు మరియు ఆధునిక భారత యువతకు మధ్య సమాంతరాలను ఆవిష్కరించింది. ఈ మధ్యకాలంలో ఈయన జీవితంపై పలు భాషలలో పలు సినిమాలు నిర్మించబడ్డాయి. ఆగస్టు 15, 2008న పార్లమెంటు ఆవరణలో భగత్ సింగ్ విగ్రహం ప్రతిష్టించబడింది. ఇవి కూడా చూడండి:
= = = = =
|
14, జులై 2019, ఆదివారం
భగత్ సింగ్ (Bhagat Singh)
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
Index
తెలుగులో విజ్ఞానసర్వస్వము
|
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు, సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, వార్తలు, సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు, |
విభాగాలు: |
------------
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి