ఆంధ్రప్రదేశ్ గవర్నరుగా నియమితులైన బిశ్వభూషణ్ ప్రముఖ న్యాయవాదిగా, రాజకీయ నాయకుడిగా పేరుపొందారు. ఆగస్టు 3, 1934న జన్మించిన బిశ్వభూషణ్ భాజపా మాతృపార్టీ అయిన జనసంఘ్ పార్టీ ద్వారా 1971లో రాజకీయాలలో ప్రవేశించి 1977లో జనతాపార్టీ ఒడిషా రాష్ట్ర కార్యదర్శిగా పనిచేశారు. 1980లో భాజపా అవతరణతో 1980-88 వరకు ఒడిశా భాజపా అధ్యక్షుడిగా వ్యవహరించారు. ఐదు సార్లు ఒడిశా రాష్ట్ర ఎమ్మెల్యేగా బిశ్వభూషణ్ ఎన్నికయ్యారు. మధ్యలో కొంతకాలం జనతాదళ్‌లో ఉండి మళ్ళీ భాజపాలో ప్రవేశించారు. 2004లో బిజద-భాజపా సంకీర్ణ ప్రభుత్వంలో రాష్ట్రమంత్రిగా బాధ్యతలు కూడా నిర్వహించారు.
బిశ్వభూషణ్ రచయిత కూడా. ఒడియాలో ఆయన పలు గ్రంథాలు రాశారు. మారుబటాస్, రాణా ప్రతాప్, శేషజలక్, అస్తశిఖ, మానసి గ్రంథాలను రాయన రాశారు. సుదీర్ఘమైన రాజకీయ జీవితం కలిగిన బిశ్వభూషణ్ చిలికా, భువనేశ్వర్ అసెంబ్లీ నియోజకవర్గాలకు ప్రాతినిథ్యం వహించారు. జూలై 16, 2019న ఆంధ్రప్రదేశ్ గవర్నరుగా రాష్ట్రపతిచే నియమితులైనారు. ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత విభజిత ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలకు కల్పి నరసింహన్ గవర్నరుగా వ్యవహరించారు. ఆంధ్రప్రదేశ్ అమరావతి నుంచి పాలన కొనసాగించడంతో ఆ రాష్ట్రానికి ప్రత్యేక గవర్నర్‌ను కేంద్రం నియమించింది. ఇవి కూడా చూడండి:
= = = = =
|
16, జులై 2019, మంగళవారం
బిశ్వభూషణ్ హరిచందన్ (Biswabhusan Harichandan)
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
Index
తెలుగులో విజ్ఞానసర్వస్వము
|
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు, సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, వార్తలు, సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు, |
విభాగాలు: |
------------
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి